త్వరలో వారాహి పార్ట్-2
పవన్ యాత్ర చేసినన్ని రోజులు ఆయనే హెడ్ లైన్స్ లో ఉన్నారు. ఆయన్ను అలా లైమ్ లైట్ లో ఉండేలా చేశారు వైసీపీ నేతలు. చివరకు సీఎం జగన్ సహా అందరూ ఆయనపై మూకుమ్మడిగా మాటల దాడి చేశారు.
తిట్టారు, తిట్టించుకున్నారు, చెప్పుల కథ చెప్పారు, సీక్రెట్లన్నీ బయటపెడతానంటూ వార్నింగ్ లు ఇచ్చారు.. తిరిగి షూటింగ్ లకు వెళ్లిపోయారు. ఇదీ సింపుల్ గా ఏపీలో పవన్ కల్యాణ్ వారాహి పార్ట్-1 యాత్ర వ్యవహారం. ఇప్పుడు పార్ట్-2 కోసం వారాహి సిద్ధమవుతోంది, పవన్ రెడీ అవుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఈ యాత్ర మొదలవుతుందని చెప్పారు ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. త్వరలోనే జిల్లా నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర కంటే వారాహి యాత్ర టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిందనే విషయం వాస్తవం. లోకేష్ ని పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదు కానీ, పవన్ యాత్ర చేసినన్ని రోజులు ఆయనే హెడ్ లైన్స్ లో ఉన్నారు. ఆయన్ను అలా లైమ్ లైట్ లో ఉండేలా చేశారు వైసీపీ నేతలు. చివరకు సీఎం జగన్ సహా అందరూ ఆయనపై మూకుమ్మడిగా మాటల దాడి చేశారు. ఆ యాత్ర జనసేనకు లాభమా, టీడీపీకి లాభమా, లేక వైసీపీకి పరోక్షంగా మేలు చేసిందా.. అనే విషయం పక్కనపెడితే ఎన్నికల ఏడాదికి ముందు పవన్ కల్యాణ్ కి కాస్త హైప్ వచ్చింది. అయితే యధావిధిగా తిరిగి సినిమా షూటింగ్ లతో బిజీ అయిన జనసేనాని రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు.
వారాహికి అద్భుత స్పందన వచ్చిందని అంటున్న జనసేన నేతలు వీలైనంత త్వరగా రెండో భాగం మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. కనీసం ఆ రెండు జిల్లాల్లో అయినా జనసేన ఈసారి సత్తా చూపించే అవకాశాలున్నాయని ఆశపడుతున్నారు. అందుకే ఆ రెండు జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదంటూ పవన్ పంతం పట్టారు, వైసీపీ విముక్త గోదావరి జిల్లాలు అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. వారాహి పార్ట్-2 విషయానికొస్తే.. పవన్ ఇదే స్పీడ్ కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాలి.