ఒంటెత్తు పోకడలతో ఏపీలో బీజేపీని పాతరేస్తున్న పురందేశ్వరి
పురందేశ్వరి ధాటికి పార్టీలో సీనియర్లంతా కకావికలమైపోయారు. పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు సోదిలో కూడా లేరు. ఆమె ఉంటే ఇక్కడ మనం నెగ్గుకురాలేమని మరో మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తట్టాబుట్టా సర్దుకుని టీడీపీలోకి వెళ్లిపోయారు.
పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపికయినప్పటి నుంచి ఆ పార్టీలో సీనియర్ల మాట చెల్లుబాటయ్యే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌లో ఉన్నా, ఇప్పుడు బీజేపీలో చేరినా మహి ళా నేత అనే ట్యాగ్‌లైన్, ఎన్టీఆర్ కూతురు అనే ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్‌తో అధిష్టానానికి దగ్గరవడం ఆమె స్పెషాలిటీ. అలాగే ముందుకెళుతూ అప్పటికే ఉన్న సీనియర్లను పక్కనపెట్టేస్తుండటం కూడా పురందేశ్వరికి వెన్నతో పెట్టిన విద్య. ఏపీలో ఎలాగైనా ప్రత్యామ్నాయంగా ఎదగాలని పాకులాడుతున్న బీజేపీకి పురందేశ్వరి తన ఒంటెత్తు పోకడలతో నిలువెత్తు గొయ్యి తీసేస్తున్నారు.
సోదిలో లేని సీనియర్లు
పురందేశ్వరి ధాటికి పార్టీలో సీనియర్లంతా కకావికలమైపోయారు. పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు సోదిలో కూడా లేరు. ఆమె ఉంటే ఇక్కడ మనం నెగ్గుకురాలేమని మరో మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తట్టాబుట్టా సర్దుకుని టీడీపీలోకి వెళ్లిపోయారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు లాంటి వాగ్ధాటి ఉన్న నాయకులనూ పక్కనపెట్టేసిన పురందేశ్వరి అన్నీ తానై అన్నట్లు బీజేపీని ఆగమాగం చేస్తున్నారు.
టికెట్లలో ఆమె చెప్పిందే చెల్లుబాటు
తాను ఎంపీ కావాలి.. కేద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే మంత్రి పదవి తెచ్చుకోవాలి.. ఇదే పురందేశ్వరి టార్గెట్. అందుకే తనకు ఎంపీ సీటు ఖాయం చేసుకుని..మిగిలిన స్థానాలు చంద్రబాబు ఎక్కడ చెబితే అక్కడ తీసుకునేలా పురందేశ్వరి ఫిక్సయిపోయారు. పార్టీ హైకమాండ్ నుంచి పంపిన నాయకులనూ ఆమె మభ్యపెట్టి చంద్రబాబు హవాయే నడిచేలా చూస్తున్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరిలాంటి చంద్రబాబు అనుయాయులకు బీజేపీలో టికెట్లు ఇప్పించారు. పార్టీలో దశాబ్దాలుగా సేవ చేస్తున్న భూపతిరాజు శ్రీనివాసవర్మ ఒక్కరే సీనియర్ల కోటాలో ఎంపీ టికెట్ తెచ్చుకోగలిగారు. రఘురామ కోసం చంద్రబాబు చేస్తున్న రాజకీయాల్లో శ్రీనివాసవర్మను కూడా బలిపెట్టేయడానికి చిన్నమ్మ సిద్ధమైపోయారు. ఆయనకు ఇచ్చిన నరసాపురం ఎంపీ సీటును రఘురామకృష్ణంరాజుకు ఇవ్వాలని, శ్రీనివాసవర్మను ఉండి అసెంబ్లీలో పోటీ చేయిద్దామని చంద్రబాబు కోరితే అలాగే అలాగే అంటూ కేంద్ర పార్టీకి రాయబారం నడుపుతున్నారు.