ఎట్టకేలకు దిగొచ్చిన టీటీడీ

తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్తను అందించింది.

Advertisement
Update:2024-12-27 17:22 IST

తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్తను అందించింది. వారానికి రెండు సార్లు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలు అనుమతించాలని తిరుమల బోర్డు నిర్ణయించింది. అయితే గత ప్రభుత్వ హయాంలో.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు.. ఇటీవల కాలంలో స్వయంగా శ్రీవారి సన్నిధిలోనే.. తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులను చిన్న చూపు చూస్తున్నారని.. తమకు కూడా.. విలువ ఇవ్వాలని విమర్శించారు.

వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో టీటీడీ సభ్యులతో చర్చించారు. ఈ క్రమంలో మెజారిటీ సభ్యులు.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా గౌరవం ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో టీటీడీ బోర్డు.. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయించినట్లు శుక్రవారం ప్రకటించారు. దీంతో ఇకపై ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వెళ్లే భక్తులకు వారానికి రెండు సార్లు.. దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

Tags:    
Advertisement

Similar News