తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ బోర్డు వెల్లడి
Advertisement
శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడటానికి తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. గత కొన్నిరోజులుగా కొందరు రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతున్నదని టీటీడీ భావించింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు ఇటీవల తీర్మానించింది. దీన్ని తాజాగా అమల్లోకి తీసుకువచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నది.
Advertisement