నేడు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్న చంద్రబాబు

విజయనగరం స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన కారణంగా ఆ జిల్లాలో సీఎం పర్యటన రద్దు

Advertisement
Update:2024-11-02 09:53 IST

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీకాకుళంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రాత్రి బస చేశారు. ఆయన అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి జిల్లాకు చేరుకోనున్నారు. మరోవైపు చంద్రబాబు నేటి విజయనగరం జిల్లా పర్యటన రద్దయ్యింది. విజయనగరం స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన కారణంగా పర్యటన రద్దయ్యింది. ఈ మేరకు సీఎం పర్యటన రద్దయినట్లు మంత్రి కొండపల్లి కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది.

ఉదయం 11.15 గంటలకు హెలికాప్టర్‌లో చింతగోరువానిపాలెంలోని లారస్‌ సంస్థ వద్దకు చంద్రబాబు చేరుకోనున్నారు. సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలేనికి చేరుకోనున్నారు. రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 1.25 గంటలకు హెలికాప్టర్‌ రుషికొండ వెళ్లి ఏపీ టూరిజం రిసార్ట్స్‌ను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.

ఎర్రన్నాయుడు వర్ధంతి... సీఎం నివాళి

ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. నిత్యం ప్రజల కోసం పరితపిస్తూ.. ప్రజాసేవలోనే తుది శ్వాస విడిచారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి అన్నారు. 

Tags:    
Advertisement

Similar News