నాకు ఇవే చివరి ఎన్నికలు- కొడాలి నాని

జగన్‌ మీద ఈగ వాలనీయకుండా.. మాస్‌ కౌంటర్లు ఇచ్చే నేతల్లో నాని ముందుంటారు. ఇక చంద్రబాబు పేరెత్తితే చాలు.. రెచ్చిపోతుంటారు.

Advertisement
Update:2024-03-07 21:22 IST

మాజీ మంత్రి, ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌ కొడాలి నాని సంచలన ప్రకటన చేశారు. తనకు ఇవే చివరి ఎన్నికలని ప్రకటించారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తనకు ప్రస్తుతం 53 ఏళ్లు వచ్చాయని.. మరోసారి గెలిస్తే 58 ఏళ్ల వరకు పదవిలో ఉంటానన్నారు నాని. తర్వాత ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు.

తన కూతుళ్లకు రాజకీయాలపై ఆసక్తి లేదని.. వాళ్లు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు కొడాలి నాని. ఆసక్తి ఉంటే తన తమ్ముడి కుమారుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. జగన్‌ మీద ఈగ వాలనీయకుండా.. మాస్‌ కౌంటర్లు ఇచ్చే నేతల్లో నాని ముందుంటారు. ఇక చంద్రబాబు పేరెత్తితే చాలు.. రెచ్చిపోతుంటారు. రాజకీయాల్లో తనకుంటూ మాస్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు.

2004లో గుడివాడ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్‌పై మొదటిసారి గెలిచిన నాని.. 2009లోనూ వరుసగా రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2012లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. 2014, 2019లో వైసీపీ టికెట్‌పై గెలిచిన నాని.. జగన్ తొలి కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు.

Tags:    
Advertisement

Similar News