వృద్ధి రేటును పెంచేలా ఈ బడ్జెట్
వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులున్నాయన్న ఏపీ సీఎం
Advertisement
భారత్ అభివృద్ధిని ప్రపంచదేశాలు గమనిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికతలో భారత్ ముందుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో మన దేశం పేరు మార్మోగుతున్నదని చెప్పారు. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. ఎంఎస్‌ఎంఈ పాలసీ గేమ్‌ఛేంజర్‌గా మారబోతున్నది. దేశంలో పెట్టుబడులకు చాలామంది ముందుకొస్తున్నారు. పలురంగాల్లో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి. నూతన ఆవిష్కరణలతో పాటు మౌలిక సదుపాయాల కల్పన పెరుగుతున్నది.వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులున్నాయని వివరించారు. పన్ను సంస్కరణల్లో చాలా మార్పులు జరిగాయన్నారు. వృద్ధి రేటును పెంచేలా ఈ బడ్జెట్ ఉందని చంద్రబాబు తెలిపారు.
Advertisement