టెన్త్‌ హాల్‌ టికెట్లు వచ్చేశాయ్.. డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఈ ఏడాది 6,23,092 మంది పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు కాగా, 3,05,153 మంది బాలికలున్నారు. పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు.;

Advertisement
Update:2024-03-04 11:50 IST
టెన్త్‌ హాల్‌ టికెట్లు వచ్చేశాయ్.. డౌన్‌లోడ్‌ చేసుకోండి
  • whatsapp icon

ఏపీలో పదో తరగతి పరీక్షల హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌ www.bse.ap.gov.in ద్వారా విద్యార్థులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది 6,23,092 మంది పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు కాగా, 3,05,153 మంది బాలికలున్నారు. పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు.

హాల్‌టికెట్స్‌ కోసం కింది లింక్‌పై క్లిక్‌ చేయండి

https://www.bse.ap.gov.in/apsscht24/HallTicketsSel.aspx

పదో తరగతి పరీక్షల షెడ్యూల్

మార్చి 18 - ఫస్ట్ లాంగ్వేజ్

మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్

మార్చి 21 - ఇంగ్లీష్‌

మార్చి 23 - గణితం

మార్చి 26 - ఫిజిక్స్

మార్చి 28 - బయాలజీ

మార్చి 30 - సోషల్ స్టడీస్

Tags:    
Advertisement

Similar News