వైసీపీ మీద టీడీపీ మైండ్ గేమ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలిచిన నాటి నుంచి అధికార వైసీపీపై టీడీపీ పూర్తి స్థాయిలో మైండ్ గేమ్ ఆడేస్తోంది. టీడీపీ దెబ్బకు వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే వైసీపీ నుండి ఆ ఎమ్మెల్యే వచ్చేస్తున్నారు, ఈ ఎమ్మెల్యే వచ్చేస్తున్నారంటూ బాగా రచ్చ జరుగుతోంది.
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం విచిత్రంగా ఉంది. ఈ మధ్యనే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలిచిన విషయం తెలిసిందే. ఆ ఫలితాలతో టీడీపీ రెచ్చిపోతోంది. ఎలాగూ ఎల్లో మీడియా మద్దతు ఉండటం వల్ల అధికార వైసీపీపై పూర్తి స్థాయిలో టీడీపీ మైండ్ గేమ్ ఆడేస్తోంది. టీడీపీ దెబ్బకు వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే వైసీపీ నుండి ఆ ఎమ్మెల్యే వచ్చేస్తున్నారు, ఈ ఎమ్మెల్యే వచ్చేస్తున్నారంటూ బాగా రచ్చ జరుగుతోంది.
ప్రతిరోజు మీడియాతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తూ టీడీపీ మైండ్ గేమ్ అప్లై చేస్తోంది. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి పార్టీలో నుండి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. వీళ్ళిద్దరు లాగానే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా వైసీపీ నుండి బయటకు వచ్చేస్తున్నట్లు ప్రచారమవుతోంది. నల్లపురెడ్డి అదంతా తప్పుడు ప్రచారమని చెప్పినా ప్రచారం ఆగటంలేదు.
ఇక తెలుగుమహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ.. వైసీపీలోని 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఇదే విధంగా బోండా ఉమ, అచ్చెన్నాయుడు, బుద్ధా వెంకన్న ఇలా ఎవరో ఒకళ్ళు ప్రతిరోజు పదే పదే ఇవే మాటలు చెబుతున్నారు. దాంతో వైసీపీలో గందరగోళం జరుగుతోంది. టీడీపీ నేతల ప్రకటనలను ప్రతిరోజు ఖండించాలంటే వైసీపీ బాగా ఇబ్బంది పడుతోంది.
ఎమ్మెల్సీ పోలింగు ముందే టీడీపీకి 16 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తామని రెడీ అయితే, వాళ్ళలో నలుగురు మాత్రమే చాలని చంద్రబాబునాయుడు అన్నట్లుగా టీడీపీ ప్రచారం చేస్తోంది. నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌లో బయటపడటంతో మరికొంతమందిని కూడా వైసీపీ నాయకత్వం అనుమానించాల్సొస్తోంది. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కదు, లేదా అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న వారిమీదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎంతమందికి టికెట్ల వస్తాయో రాదో తెలీదు కానీ టీడీపీ మాత్రం వైసీపీ మీద ఓ రేంజ్‌లో మైండ్ గేమ్ ఆడేస్తోంది.