చంద్రబాబూ.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు..? - సీమవాసుల డిమాండ్

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు విషయంలో చంద్రబాబు తమ వైఖరిని వివరించాలని వారు అడుగుతున్నారు. కర్నూలుకు న్యాయ రాజధాని రావడానికి చంద్రబాబు ఒప్పుకుంటున్నారా..? లేదా..? అన్న విషయం సూటిగా చెప్పాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Update:2022-12-05 17:38 IST

రాయలసీమకు న్యాయ రాజధాని కావాలన్న డిమాండ్‌తో నేడు కర్నూలులో సీమ గర్జన పేరుతో భారీ బహిరంగసభ, ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు రాయలసీమకు చెందిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరై తమ గళం వినిపించారు. టీడీపీ సీమకు అన్యాయం చేస్తోందంటూ వారు నినదించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సభపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అసలు రాయలసీమకు హైకోర్టు ఎందుకు తీసుకెళ్లాలి..? కేవలం నాలుగు జిరాక్స్ సెంటర్ల కోసమా..? అంటూ అమరావతి మద్దతు దారులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సీమ వాసులు కూడా గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు.

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు విషయంలో చంద్రబాబు తమ వైఖరిని వివరించాలని వారు అడుగుతున్నారు. కర్నూలుకు న్యాయ రాజధాని రావడానికి చంద్రబాబు ఒప్పుకుంటున్నారా..? లేదా..? అన్న విషయం సూటిగా చెప్పాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే సీమ గర్జన సభపై తెలుగుదేశం శ్రేణులు, పచ్చ మీడియా మాత్రం మౌనంగా ఉండిపోయింది. ఈ సభపై వ్యతిరేకంగా వ్యవహరిస్తే అక్కడి ప్రజల కోపానికి గురి కావాల్సి వస్తుందేమోనని వారు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతో పచ్చ మీడియా సైలెంట్ అయిపోయింది.

మరోవైపు ఈ విషయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించడం గమనార్హం. సీపీఐ పార్టీ కార్మికుల పక్షాన పోరాడాలి. కానీ, ఏపీలో పరిస్థితి అందుకు భిన్నం. అక్కడ సీపీఐ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ ఉంటుంది. తాజాగా ప్రభుత్వంలో ఉన్నవాళ్లు పోరాటాలు చేయడం ఏమిటని సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు. ఇదిలా ఉంటే మొత్తంగా కర్నూలులో నిర్వహించిన సభ.. తెలుగుదేశం పార్టీకి కొత్త చిక్కులు తీసుకొచ్చింది. కర్నూలు న్యాయ రాజధానిగా ఉండాలా..? లేదా..? అన్న విషయంపై చంద్రబాబు నాయుడు సూటిగా సమాధానం చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News