ముంద‌స్తు ముచ్చ‌టే లేదు..అవ‌న్నీ చంద్ర‌బాబు మాయ‌మాట‌లే : స‌జ్జ‌ల‌

ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయంటూ జరుగుతున్న‌ ప్ర‌చారం పై సజ్జల రామకృష్ణా రెడ్డి మండిప‌డ్డారు. ఈ ప్ర‌చారాల‌న్నీ చంద్ర‌బాబు, తెలుగుదేశం పార్టీ ని మోసే మీడియా నుంచే వ‌స్తున్నాయ‌ని ఆయన విమ‌ర్శించారు. టీడీపీలో ఊపులేక ముందస్తు ఎన్నిక‌లంటూ మాయ‌ మాటలు చెబుతూన్నారని ఎద్దేవా చేశారు.

Advertisement
Update:2022-12-15 19:45 IST

ఆంద్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని, ప్రజలిచ్చిన ఐదేళ్ల కాలం పూర్తయ్యే వరకు తాము అధికారంలో ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. పొత్తులు, ఎత్తులు.. లాంటి చచ్చు ఆలోచనలు తమకు లేవని అన్నారు.

రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయంటూ చేస్తున్న ప్ర‌చారం పై ఆయ‌న మండిప‌డ్డారు. ఈ ప్ర‌చారాల‌న్నీ చంద్ర‌బాబు, తెలుగుదేశం పార్టీ ని మోసే మీడియా నుంచే వ‌స్తున్నాయ‌ని విమ‌ర్శించారు. ఆయన పార్టీలో ఊపులేక ముందస్తు ఎన్నిక‌లంటూ మాయ‌ మాటలు చెబుతూన్నారని ఎద్దేవా చేశారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు ఎప్పుడూ మాయ మాటలు చెబుతుంటారని విమర్శించారు. కౌలు రైతుల సంబంధించి మెరుగైన విధానం ఏదైనా ఆయ‌న వ‌ద్ద ఉంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించ‌వ‌చ్చ‌ని అన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదేనని మ‌రోసారి వ్యాఖ్యానించారు. వైసీపీ తెలంగాణలో పోటీ చేయబోదని, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నామ‌ని సజ్జల చెప్పారు. వైసీపీ కర్ణాటకలో పోటీ చేస్తుందంటూ వస్తున్న వార్త‌ల‌ను ఖండించారు. ఇవ‌న్నీ కేవలం ఊహాగానాలే అని కొట్టిపారేశారు. తాము ఏపీకి మాత్రమే పరిమితం అని సజ్జల స్ప‌ష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News