తిరుమల నుంచి అన్యమత ఉద్యోగులు ఔట్
ఇతర శాఖలకు బదిలీ చేయాలని నిర్ణయం
Advertisement
తిరుమల శ్రీవారి సన్నిధి నుంచి అన్యమత ఉద్యోగులను బయటకు పంపేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. విధుల్లో ఉన్న సమయంలో ఇతర మతాచారాలు పాటిస్తున్న 18 మందిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. వారిని ఇతర విభాగాలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. వారిలో ఎవరైనా స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ముందుకు వస్తే వారికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. గతేడాది నవంబర్ 18న నిర్వహించిన టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు ఆలయ అధికారులు ఉపక్రమించారు.
Advertisement