కేంద్రమంత్రిపై టీడీపీ కార్యకర్తల ఆగ్రహం

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు

Advertisement
Update:2025-02-05 15:54 IST

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దర్శనానికి సింగర్ మంగ్లీని తీసుకెళ్లడంపై టీటీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీకి ప్రచారం చేసిన మంగ్లీని ఎలా తీసుకెళ్తారంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నరు చంద్రబాబు పేరు పలకనన్న మంగ్లీ వీఐపీ అయ్యింది.. పార్టీ కోసం 40 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తలు వీఐపీలు కాలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబు పేరు పలకనన్న మంగ్లీ వీఐపీ అయ్యింది.. పార్టీ కోసం 40 ఏళ్లు కష్టపడ్డవాళ్లు వీఐపీలు కాలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ హయాంలో టీటీడీ ఛానెల్‌కు మంగ్లీ సలహాదారుగా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ తరపున ఆమె పాడిన పాటలు ఓటర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అదే సమయంలో టీడీపీకి పాటలు పాడాలని రిక్వెస్ట్ చేశారట కొందరు నేతలు. ఎట్టి పరిస్థితుల్లో పాడేది లేదని తెగేసి చెప్పారంట సింగర్. ఈ వ్యవహారాన్ని నేతలు మరిచిపోయినా, కార్యకర్తలు మరిచిపోలేదు. ఇది ముమ్మాటికీ పార్టీ కార్యకర్తలను అవమానించడమే అవుతుందని అంటున్నారు. ఈ విషయంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎలా స్పందిస్తాడో చూడాలి.

Tags:    
Advertisement

Similar News