అప్పుడు అవినాష్..ఇప్పుడు రామోజీ
మార్గదర్శి చీటింగ్ కేసు దాదాపు నిర్ధారణైపోయింది. రెండు విడతల విచారణలోనే మామ, కోడళ్ళు తాము నిబంధనలను ఉల్లంఘించినట్లు అంగీకరించారు. కాలమహిమ బెయిల్ కోసం అప్పుడు అవినాష్ పరుగులు పెడితే ఇప్పుడు రామోజీ పరుగులు పెడుతున్నారు.
సీబీఐ అరెస్టు చేయకుండా పది రోజుల క్రితం కడప ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టుల చూట్టు ఎంత తిరిగారు? బెయిల్ వచ్చేంత వరకు ఎంత టెన్షన్ అనుభవించారో అందరూ చూసిందే. సేమ్ టు సేమ్ ఇప్పుడు మార్గదర్శి కేసులో ఛైర్మన్ రామోజీరావు అలాగే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అరెస్టు నుండి తప్పించుకునే విషయంలో అదే టెన్షన్ పడుతున్నారు. మార్గదర్శి చీటింగ్ కేసు విచారణలో ఛైర్మన్‌గా తనతో పాటు ఎండీగా కోడలు శైలజను సీఐడీ ఎక్కడ అరెస్టు చేస్తుందో అనే టెన్షన్ రామోజీలో పెరిగిపోతోంది.
అందుకనే తమపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశారు. యాజమాన్యం మీద ఉద్యోగుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. హైకోర్టు ఉత్తర్వులు అమలుకాకుండా వెంటనే స్టే ఇవ్వాలన్న ప్రభుత్వం పిటీషన్‌పై సోమవారం విచారణ జరిగింది. రెండు వైపుల విచారించిన తర్వాత కేసును జూలై 18కి వాయిదా వేసింది.
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ తమ దర్యాప్తుకు అడ్డంకిగా మారిందని ఏపీ ప్రభుత్వం తన పిటీషన్లో వాదించింది. చిట్ ఫండ్ డిపాజిట్‌దారుల్లో ఎక్కువ మంది ఏపీలోనే ఉన్నారని, కార్పొరేట్ ఆఫీసు హైదరాబాద్‌లో ఉందన్న విషయాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళింది. కాబట్టి ఖాతాదారుల రక్షణ కోసం తాము దర్యాప్తు చేయటం చాలా అవసరమని వెంటనే స్టేని కొట్టేయాలని ప్రభుత్వం వాదించింది. విచారణ సందర్భంగా తమను సీఐడీ అరెస్టు చేయచ్చని రామోజీ భయపడుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధంలేదని అవినాష్ వాదిస్తున్నారు. అవినాష్ పాత్రను నిరూపించేందుకు సీబీఐ దగ్గర ఆధారాలు కూడా ఏమీలేవు. అనుమానంతో మాత్రమే అరెస్టు చేసేందుకు ప్రయత్నించింది. విచారణలో అవినాష్ పాత్రపై జడ్జి అడిగిన ప్రశ్నలకు సీబీఐ సమాధానం చెప్పలేకపోయింది. అందుకనే ఎంపీకి కోర్టు బెయిలిచ్చింది. కానీ మార్గదర్శి చీటింగ్ కేసు దాదాపు నిర్ధారణైపోయింది. రెండు విడతల విచారణలోనే మామ, కోడళ్ళు తాము నిబంధనలను ఉల్లంఘించినట్లు అంగీకరించారు. సీఐడీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయారని సమాచారం. కాలమహిమ బెయిల్ కోసం అప్పుడు అవినాష్ పరుగులు పెడితే ఇప్పుడు రామోజీ పరుగులు పెడుతున్నారు.