తిరుమల ఇక ఏమాత్రం గజిబిజి కాదు..

క్యూఆర్ కోడ్ ని మన స్మార్ట్ ఫోన్ లో స్కాన్ చేస్తే మనం వెళ్లాల్సిన రూట్ మ్యాప్ మొబైల్ లో ప్రత్యక్షమవుతుంది. మనం దారి తప్పితే గూగుల్ మ్యాప్ మనల్ని అలర్ట్ చేస్తుంది.

Advertisement
Update:2022-09-21 11:32 IST

తరచూ శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులైనా కొండపై కచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఏడాదికోసారి వెళ్లేవారికి దారులన్నీ గజిబిజిగానే ఉంటాయి. ఉచిత దర్శనం ఎక్కడ, 300 రూపాయల క్యూలైన్ ఎక్కడ, కల్యాణ కట్టఎక్కడ, ఫలానా కాటేజీ ఎక్కడ..? అనే అనుమానాలు అందరికీ ఉంటాయి. ఇకపై ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా భక్తులకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేస్తోంది టీటీడీ. క్యూఆర్ కోడ్ ద్వారా మీరు ఎక్కడికి వెళ్లాలన్నా ఆ మార్గం మీ అరచేతిలోనే కనపడుతుంది. స్మార్ట్ ఫోన్లో రూట్ మ్యాప్ దొరికిపోతుంది.

తిరుమల మార్గదర్శిని అనేది గతంలో కూడా ఉంది. కానీ అది కేవలం పేపర్ పై రూట్ మ్యాప్ మాత్రమే చూపిస్తుంది. అతిథి గృహాలు, పర్యాటక ప్రాంతాలు, క్యూకాంప్లెక్స్ లు, ఆస్పత్రులు.. ఇలా అన్నింటి సమాచారం అందులో ఉంటుంది. ఇప్పుడు ఆ మార్గదర్శినిలోకి కొత్తగా క్యూఆర్ కోడ్ వచ్చి చేరింది. ఈ క్యూఆర్ కోడ్ ని మన స్మార్ట్ ఫోన్ లో స్కాన్ చేస్తే మనం వెళ్లాల్సిన ప్రదేశానికి రూట్ మ్యాప్ మొబైల్ లో ప్రత్యక్షమవుతుంది. మనం దారి తప్పితే గూగుల్ మ్యాప్ మనల్ని అలర్ట్ చేస్తుంది. దాని ప్రకారం మనం ఎక్కడికైనా సులభంగా వెళ్లొచ్చు. ఎవరినీ అడగాల్సిన పని ఉండదు, అడ్రస్ వెతుక్కుంటూ ఒకటికి రెండుసార్లు తికమకపడే అవసరం అంతకంటే ఉండదు.

స్మార్ట్ టెక్నాలజీ..

మార్గదర్శినిలో ఉన్న కోడ్ ని మన మొబైల్ ద్వారా స్కాన్ చేస్తే వాటి వివరాలు ఫోన్లో వచ్చేస్తాయి. ప్రయోగాత్మకంగా ఈ మార్గదర్శినిలను ఇప్పుడు తిరుమలలో అందుబాటులోకి తెస్తున్నారు. ఎక్కడికక్కడ సమాచార కేంద్రాలున్నా కూడా తిరుమలలో ఉన్న రద్దీ కారణంగా వాటిని ఉపయోగించుకోవడం కష్టం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం కేవలం మొబైల్ తో పని కాబట్టి ఎవరి అవసరం ఉండదు, ఎవరి సహాయం లేకుండానే మనం కోరుకున్న చోటకి సులభంగా వెళ్లొచ్చు. అయితే ఇది కేవలం స్మార్ట్ ఫోన్లు వినియోగించే వారికే పరిమితం. మిగతావారు యధావిధిగా అడ్రస్ అడుగుతూ వెళ్లాల్సిందే.

Tags:    
Advertisement

Similar News