చంద్రబాబు మాటలు ఎవరైనా నమ్ముతారా?

ఎన్నికల్లో మాత్రమే పేరును ప్రస్తావించే చంద్రబాబుకు ఎన్టీఆర్‌ తన ఆరాధ్య దైవమని చెబితే ఎవరైనా నమ్ముతారా అంటు నెటిజన్లు నిలదీస్తున్నారు.

Advertisement
Update:2022-10-12 12:50 IST

ఒక టీవీ ఛానల్లో నందమూరి బాలకృష్ణ హోస్టుగా ఉన్న కార్యక్రమానికి చంద్రబాబు నాయుడును గెస్ట్‌గా పిలిచారు. దానికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అందులో మిగిలిన విషయాలు ఎలాగున్నా ఒక విషయంలో మాత్రం నెటిజన్లు చంద్రబాబును బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే 1995లో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన అంశం.

జీవితంలో మీరు బాగా బాధపడిన సందర్భం ఏదైనా ఉందా అని బాలయ్య అడగ్గానే వెంటనే చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్‌ను ప్రస్తావించారు. వెన్నుపోటు అనకుండా 1995 సంక్షోభం అని చెప్పి 'ఎన్టీఆర్‌ను కాళ్ళు పట్టకుని బతిమలాడా..వినలేదు' అన్నారు. 'ఇప్పటికీ ఎన్టీఆరే తన ఆరాధ్య దైవం..ఎన్టీఆర్‌ తన గుండెల్లోనే ఉన్నారు' అని చెప్పారు. పూర్తి వివరాలు కావాలంటే ఆ షోను చూడాల్సిందే. సరే ప్రోమోలో డైలాగులను చూసిన తర్వాత నెటిజన్లు నెగిటివ్‌గా రియాక్టవుతున్నారు.

నిజంగానే చంద్రబాబుకు ఎన్టీఆర్‌ ఆరాధ్యదైవమైతే వెన్నుపోటు పొడిచే ప్రసక్తే ఉండేది కాదంటు మండిపడుతున్నారు. నిజంగానే చంద్రబాబుకు ఎన్టీఆర్‌ అంతటి ఆరాధ్య దైవమైతే ఎన్టీయార్ గురించి చాలా చీపుగా ఎలా మాట్లాడారంటు నిలదీస్తున్నారు. చంద్రబాబు సీఎం అయిన కొత్తల్లోనే ఎన్టీఆర్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'ఉయ్ డోంట్ నీడ్ ఎన్టీయార్' అని చెప్పిన విషయాన్ని పోస్టర్లుగా మార్చి విజయవాడలో అంటించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

నిండు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎన్టీఆర్‌ను అవమానించిన విషయాన్ని నెటిజన్లు అప్పటి పేపర్ క్లిప్పుంగులతో సహా ఇపుడు చూపిస్తున్నారు. అందరు కలిసి ఎన్టీఆర్‌ను దింపేయాలని అనుకునే దింపేశారని నెటిజన్లు తీర్మానించేశారు. ఎన్నికల్లో మాత్రమే పేరును ప్రస్తావించే చంద్రబాబుకు ఎన్టీఆర్‌ తన ఆరాధ్య దైవమని చెబితే ఎవరైనా నమ్ముతారా అంటు జనాలు నిలదీస్తున్నారు. మొత్తానికి ప్రోమో విషయంలోనే నెటిజన్లు ఇంతగా రియాక్టవుతున్నారంటే ఇక ఫుల్ ఫో ప్రసారమైతే ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News