మోసం, దగా, కుట్రపై పేటెంట్ హక్కు చంద్రబాబుదే
ఈసారి విశాఖపట్నంలోనే సీఎం జగన్ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖ పరిపాలన రాజధానికి జగన్ కట్టుబడి ఉన్నారన్నారు.
ఈ ప్రపంచంలో మోసం, దగా, కుట్రలకు పేటెంట్ హక్కు ఉంటే.. కచ్చితంగా అది చంద్రబాబుదేనని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ ఎన్నికల్లో మరోసారి ఆయన ప్రజల్ని మోసం చేసేందుకు అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారన్నారు. రాజధాని అమరావతి ఒక బూటకం అని, టీడీపీ నేతల దోపిడీకోసమే అమరావతిని తెరపైకి తెచ్చారని అన్నారు. ఏనాడూ చంద్రబాబు ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని విమర్శించారు బొత్స.
ఈసారి విశాఖపట్నంలోనే సీఎం జగన్ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖ పరిపాలన రాజధానికి జగన్ కట్టుబడి ఉన్నారన్నారు.ఈసారి గెలిచిన తర్వాత సీఎంగా తన ప్రమాణ స్వీకారం విశాఖలోనే ఉంటుందని గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని మరోసారి గుర్తు చేశారు మంత్రి బొత్స. ఈసారి విశాఖపట్నంలోనే సీఎం జగన్ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట కోసం జగన్ ఎందాకైనా వెళ్తారన్నారు. విశాఖ పరిపాలన రాజధానికి ఆయన కట్టుబడి ఉన్నారన్నారు. కొన్ని కారణాల వల్ల ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తరలింపు ఆలస్యమైందని, సీఎం జగన్ నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమని చెప్పారు మంత్రి బొత్స.
విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ పై విమర్శలు ఎక్కుపెట్టారు మంత్రి బొత్స. అసలు భరత్ కు రాష్ట్ర విద్యా వ్యవస్థపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 5 ఏళ్లలో 18 వేల మంది టీచర్లకు ఉద్యోగాలిచ్చామన్నారు. భరత్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, లేకపోతే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము పూర్తి వ్యతిరేకం అని.. కూటమి నిర్ణయమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలకు చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని బీజేపీ కీలక నేతలతో చెప్పించాలన్నారు బొత్స సత్యనారాయణ.