జనసేన వీర మహిళల్లారా మీకో నమస్కారం.. అంబటి కౌంటర్
జనసేన వీర మహిళల్లారా.. మీకు నమస్కారం.. ఇంతకు మీ ప్రయత్నం ఏమిటి.. చంద్రబాబును అందలం ఎక్కించాలనా? లేక కల్యాణ్ బాబుని సీఎం చేయాలనా? అని ప్రశ్నించారు. ఇంతకీ మీ ప్రయత్నం ఏంటో వివరంగా వివరించాలని ఆయన సెటైర్ వేశారు.
దేనికి గర్జనలు.. పేరిట జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగు రోజులుగా వరుస పెట్టి ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తూ వాటి గురించి ప్రశ్నిస్తున్నాడు పవన్. అయితే పవన్ కల్యాణ్ చేస్తున్న ట్వీట్లకు వైసీపీ మంత్రులు రోజా, అమర్నాథ్, అంబటి రాంబాబు తదితర మంత్రులు దీటుగా స్పందిస్తున్నారు. కౌంటర్ గా జనసేన పార్టీ, పవన్ తీరును ఎండగడుతున్నారు.
కాగా, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పవన్ కల్యాణ్ ట్వీట్లు చేస్తుండగా.. అందుకు కౌంటర్ ఇస్తున్న వైసీపీ మంత్రులపై జనసేన వీర మహిళలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మా అధినేత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని మంత్రులను నిలదీస్తున్నారు. ఒక్కొక్క మంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన వీర మహిళలు చేస్తున్న విమర్శలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
జనసేన వీర మహిళల్లారా.. మీకు నమస్కారం.. ఇంతకు మీ ప్రయత్నం ఏమిటి.. చంద్రబాబును అందలం ఎక్కించాలనా? లేక కల్యాణ్ బాబుని సీఎం చేయాలనా? అని ప్రశ్నించారు. ఇంతకీ మీ ప్రయత్నం ఏంటో వివరంగా వివరించాలని ఆయన సెటైర్ వేశారు.
దేనికి గర్జనలు పేరిట పవన్ మరో ట్వీట్
కొద్ది రోజులుగా ట్విట్టర్ కి పరిమితమైన పవన్ గంటకొక ట్వీట్ చేస్తూ వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ వాటి పరిష్కారంపై ప్రశ్నిస్తున్నారు. నిన్న తిరుపతి జిల్లా కేవీబీ పురంలో పాముకాటుతో మృతిచెందిన కుమారుడి మృతదేహాన్ని తండ్రి బైక్ పై పెట్టుకుని సొంతూరికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విషయమై పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.
'ఎందుకు గర్జనలు? ఆసుపత్రిలో మృతి చెందిన వారిని తరలించేందుకు వాహనం కూడా సమకూర్చ లేనందుకా.. కన్నుమూసిన బిడ్డను భుజాన వేసుకొని బైక్ మీద తీసుకు వెళ్లేలా చేసినందుకా? అంబులెన్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నందుకా? అని పవన్ ట్వీట్ చేశారు.