జగన్ ఎలక్షన్ సాంగ్.. రోమాలు నిక్కబొడుచుకోవడం పక్కా!
దాదాపు 5 నిమిషాల 15 సెకండ్ల నిడివి ఉన్న పాటను శనివారం రిలీజ్ చేశారు. పాట మధ్యమధ్యలో జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మాట్లాడిన మాటలను సైతం ఉపయోగించారు. సంక్షేమ పథకాల గురించి ఈ పాటలో చూపించారు. సోషల్ మీడియాలో ఈ పాటను వైసీపీ కార్యకర్తలు తెగ వైరల్ చేస్తున్నారు.
వైసీపీ ఫుల్ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. వై నాట్ 175 నినాదంతో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం మొదలుపెట్టిన జగన్..ఎన్నికల రణరంగంలోకి దూకేందుకు ఫీల్డ్ సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 25 నుంచి కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు వైసీపీ అధినేత. జగన్ జిల్లాల పర్యటన నేపథ్యంలో వైసీపీ ఓ సాంగ్‌ను రిలీజ్ చేసింది. జెండాలు జత కట్టడం మీ అజెండా..జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా, బలిరా బలిబలిరా బలిరా.. పులివెందులలో పుట్టిండు పులిరా అంటూ సాగే ఈ పాట ఇప్పుడు వైసీపీ క్యాడర్‌ను ఊర్రూతలూగిస్తోంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రంగుల జెండా పట్టి..సింగమోలే కదిలినాడు అంటూ రేవంత్‌కు పాట పాడిన నల్లగొండ గద్దరే...జగన్ పాటకు గాత్రం అందించడం హైలెట్‌గా నిలిచింది.
మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు..పలానా మంచి చేశామని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి లేనివారు ఏకమవుతున్నారంటూ జగన్ మాటలతో ఈ సాంగ్ ప్రారంభమవుతుంది. దాదాపు 5 నిమిషాల 15 సెకండ్ల నిడివి ఉన్న పాటను శనివారం రిలీజ్ చేశారు. పాట మధ్యమధ్యలో జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మాట్లాడిన మాటలను సైతం ఉపయోగించారు. సంక్షేమ పథకాల గురించి ఈ పాటలో చూపించారు. సోషల్ మీడియాలో ఈ పాటను వైసీపీ కార్యకర్తలు తెగ వైరల్ చేస్తున్నారు.
2019 ఎన్నికల సమయంలోనూ.....జగనన్నా జగనన్నా జనమంతా నీతోనే, జననేత జగనన్నా, రావాలి జగన్ కావాలి జగన్, సూర్యుడిలా ఉదయిస్తివి లాంటి సాంగ్స్ ఒక ఊపు ఊపాయి. ఇక రావాలి జగన్..కావాలి జగన్ అనే పాట మాత్రం ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లోనూ మూడు రంగుల జెండా పట్టి, సింగమోలే కదిలినాడు, పట్టుకో కాంగిరేసు జెండా..ఎత్తుకో నీ గుండెల నిండా..ఇక బీఆర్ఎస్‌కు సంబంధించి గులాబీల జెండాలే రామక్క, సారే కావాలంటున్నరే..కారే రావాలంటున్నరే తెలంగాణ పల్లేలల్ల లాంటి పాటలు హైలెట్‌గా నిలిచాయి.