పవన్ కళ్యాణ్ వల్లే గెలిచాను..సోలాపూర్ ఎమ్మెల్యే కామెంట్స్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని ప్రాంతాల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సోలాపూర్ సిటీ సెంట్రల్ బీజేపీ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోతే బంఫర్ మెజారిటీతో గెలిచాడు. దేవేంద్ర విజయం సాధించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు. పవర్ స్టార్‌కి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఈ విజయం కేవలం అయన వల్లే సాధ్యమైంది. అయన మెగా అభిమానులకి.. మద్దతు తెలిపిన వారికి చాలా థాంక్స్. రెండు గంటలు మీరు చేసిన రోడ్ షోకి భారీగా జనాలు వచ్చి సపోర్ట్ చేసారు. మీ మాటలతో మహారాష్ట్ర సోలాపూర్ ప్రజలను మీరు ప్రభావితం చేశారు అని దేవేంద్ర తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బీజేపీ కూటమి అభ్యర్థుల తరపున పలు ప్రాంతాల్లో ప్రచారం చేశాడు పవన్.
అయితే పవన్ ప్రచారం చేసిన అన్ని ప్రాంతాల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహారాష్ట్రలో మహాయుతి మెజార్టీ స్థానాల్లో విజయం పట్ట సంతోషం వ్యక్తం చేశారు. విజనరీ ప్రధాని మోడీ నాయకత్వం పై రాష్ట్ర ప్రజలు నమ్మకం ఉంచారని.. నిజాయితీ, అభివృద్ధికి ఓటేశారని పేర్కొన్నారు. ఫడణవీస్, ఏక్నాథ్ శిండే, అజిత్ పవార్ సమిష్టిగా పోరాడారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఎన్డీయే అభ్యర్థుల తరఫున మహారాష్ట్రలో తాను ప్రచారం చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.