తిరుమలకు తప్పిన తాగునీటి గండం

ఫెంజల్ తుపానుతో భారీ వర్షాలు..నిండుకుండలా అన్ని రిజర్వాయర్లు

Advertisement
Update:2024-12-01 12:34 IST

తిరుమల కొండపై తాగునీటి కష్టాలు తీరిపోయాయి. ఇన్నిరోజులు నీళ్లు లేక వెలవెలబోయిన రిజర్వాయర్లు ఫెంజల్ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో నిండుకుండల్లా మారాయి. తిరుమలలో రెండురోజులుగా పడుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు దాదాపుగా నిండిపోయాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం ఐదు జలాశయాల్లో నీటి మట్టం దాదాపు పూర్తి స్థాయికి చేరుకున్నది.ఇక ఏడాది దాక తిరుమలలో నీటి అవసరాలకు ఎలాంటి ఢోకా ఉండదని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

ప్రధాన జలాశయాల నీటిమట్టం ప్రస్తుత వివరాలు 

పాపవినాశనం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 697.14 మీటర్లు కాగా ప్రస్తుతం 693.27 మీటర్లుగా ఉన్నది. గోగర్భం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 2894లు కాగా పూర్తిగా నిండిపోయింది. ఆకాశగంగ డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 865.00 మీటర్లు అయితే ప్రస్తుతం 855.00 మీటర్లకు చేరింది. కుమారధార డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 898.24 మీటర్లుగా కాగా.. ప్రస్తుతం 890.80 మీటర్లకు చేరుకున్నది. ఇక పసుపుధార డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 898.24మీటర్లకు గాను 896.35మీటర్లకు చేరుకున్నది.

Tags:    
Advertisement

Similar News