ఏపీలో తొలిసారిగా తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల సమావేశం

రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం మొదలైంది.

Advertisement
Update:2024-12-02 17:12 IST

రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై సీఎస్ శాంతికుమరి, ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ నేతృత్వంలోని అధికారుల కమిటీ భేటీ అయింది. విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న 9,10 షెడ్యూల్ లోని సంస్థల ఆస్తుల పంపకాలు, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడిపై చర్చించినట్లు టాక్. ఉద్యోగుల పరస్పర మార్పిడి , వృత్తి పన్ను పంపకం పై చర్చించనున్నారు. ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక విభజన పూర్తి కాని సంస్థలకు చెందిన నగదు నిల్వలపైనా అధికారుల కమిటీలో చర్చ జరగనుంది.షెడ్యూలు 9,10 లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో పంపకం కాకుండా మిగిలిపోయిన 8 వేల కోట్ల అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు హైదరాబాద్ లో ఒకసారి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనే దానిపై వీరిద్దరూ ప్రాథమిక చర్చలు జరిపారు. తాజాగా ఈరోజు ఇరు రాష్ట్రాల సీఎస్ లు భేటీ అయ్యారు. ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్ రావు పాల్గోన్నారు.

Tags:    
Advertisement

Similar News