ప్రముఖ పత్రిక సంస్ధలకు జగన్‌ లీగల్‌ నోటీసులు

గత వైసీపీ హయాంలో సెకితో ఏపీ ప్రభుత్వం జరిపిన విద్యుత్‌ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకుగానూ రెండు పత్రిక సంస్ధలకు జగన్‌ నోటీసులు పంపారు.

Advertisement
Update:2024-11-30 20:37 IST

ప్రముఖ రెండు పత్రిక సంస్ధలకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లీగల్‌ నోటీసులు పంపించారు.సెకి ఒప్పందం పై ప్రచురించిన తప్పుడు కథనాలకు క్షమాపణలు చెప్పాలని నోటీసుల ద్వారా స్పష్టం చేశారు. ఈ మేరకు పారదర్శకంగా జరిగిన నాటి ఒప్పందం పత్రాల కాపీలను సైతం నోటీసులకు జత చేశారు జగన్. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నాటి ఏపీ ప్రభుత్వము సేకితో ఒప్పందం కుదుర్చుకుందని.. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించాయని.. కేవలం టిడిపి ప్రయోజనాల కోసమే అవి ఆ కథనాలు ఇచ్చాయని జగన్ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచురించిన ఆ కథనాలతో తన ప్రతిష్టకు భంగం కలిగిందని బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. అదేవిధంగా క్షమాపణలు చెప్పినట్టు మొదటి పేజీలో వార్త ప్రచురించాలని ఆయన నోటీసుల్లో స్పష్టం చేశారు. సేకి తో జరిగిన చారిత్రక ఒప్పందాన్ని వక్రీకరించి కథనాలు ఇచ్చిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పై పరువు నష్టం దావా వేస్తానని జగన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. సదరు తప్పుడు కథనాలకు 48 గంటల్లో స్పందించాలంటూ ఆ మీడియా సంస్థలకు ఆయన్‌ డెడ్‌లైన్‌ కూడా విధించారు. అయినా అవి స్పందించకపోవడంతో ఇప్పుడు అన్నంత పని చేశారు.

Tags:    
Advertisement

Similar News