తీరాన్ని తాకిన 'ఫెయింజల్' తుపాను... ఏపీలో అతి భారీ వర్షాలు

నెరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫెంగల్‌ తుపాను తీరాన్ని తాకింది.

Advertisement
Update:2024-11-30 20:48 IST

నెరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫెంగల్‌ తుపాను తీరాన్ని తాకింది. తమిళనాడు, పుదుచ్చేరి తీరంలో కారైక్కాల్-మహాబలిపురం మధ్య ఈ తుపాను ముందు భాగం భూభాగంపైకి చేరుకుంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా పయనిస్తోందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తుపాను తీరాన్ని దాటే సమయంలో దాదాపు మూడ్నాలుగు గంటల పాటు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తుపాను ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ముందని అమరావతి వాతావరణ విభాగం వెల్లడించింది.

కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.పెంగల్ తుపాన్‌ ప్రభావంతో తిరుమలలో నిన్న రాత్రి నుంచి భారీ ఈదురుగాలులతో వర్షం పడుతుంది. నెల్లూరు జిల్లాలో కావలి, అల్లూరు, దరదర్తి, బోగోలు మండల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. తుమ్మలపెంట సముద్రతీరం వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News