అమరావతి అభివృద్ధికి రూ.11 వేల కోట్లు

ఈ నెలాఖరుకు ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి టెండర్లు : మంత్రి నారాయణ

Advertisement
Update:2024-12-02 21:00 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదిత రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.11,467 కోట్లతో పనులు చేపట్టనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం ఆయన నివాసంలో నిర్వహించిన క్యాపిటర్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీఆర్‌డీఏ) 41వ మీటింగ్‌లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెళ్లడించారు. సమావేశంలో మొత్తం 23 అంశాలపై చర్చించామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి, ఇతర పనులకు రూ.2,498 కోట్లు, పాలవాగు, కొండవీటివాగుల పనులకు రూ.1,508 కోట్లు, రూ.3,523 కోట్లతో మూడు రిజర్వాయర్ల నిర్మాణాలు చేపడుతామన్నారు. అమరావతిలో గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ అధికారులు సెక్రటరీలు, ప్రిన్సిపల్‌ సెక్రటరీల నిర్మాణాలు చేపడుతామన్నారు. రాజధాని నిర్మాణంలో భాగంగా చేపట్టబోయే ఐదు ఐకానిక్‌ టవర్ల తుది డిజైన్‌లు ఈనెల 15వ తేదీలోగా సమర్పిస్తారని తెలిపారు. వాటికి ఆమోదం లభిస్తే ఈ నెలాఖరులోగానే టెండర్‌ నోటిఫికేషన్‌ ఇస్తామని వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News