రేపు ఆ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం సెలవు ప్రకటించారు.
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం సెలవు ప్రకటించారు. అయితే భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలకు కూడా సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి, ఆదివారం తెల్లవారుజామున తమిళనాడులోని కరైకాల్ - మహాబలిపురం వద్ద తీరం దాటింది. ఫెంగల్గా నామకరణం చేసిన ఈ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు(భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఫెంగల్ ఎఫెక్ట్ వలన ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో మరో 24 గంటల పాటు తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫెంగల్ తుపాన్ టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫెంగల్ తుపాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విధించింది ఐఎండీ. ఇక, పుదుచ్చేరిలో పలు కాలనీలు వరద ముంపులోనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.