అప్పుల కాలం బాబుది.. ఆర్థిక క్రమశిక్షణ జగన్ ది

GSDP విషయానికొస్తే, బాబు హయాంలో 4.47 శాతం GSDP ఉంటే, జగన్ హయాంలో 4.83 శాతంగా ఉంది. అంటే ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలు ఓ అంచనాకు రావొచ్చు. బాబు హయాంలో ట్యాక్స్‌ బర్డెన్‌ 6.57 శాతం కాగా, జగన్‌ హయాంలో అది 6.35 శాతమే.

Advertisement
Update:2024-05-03 11:42 IST

జగన్ హయాంలో అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేశారనే ప్రధాన ఆరోపణ టీడీపీ నుంచి వినపడుతోంది. ఎన్నికల టైమ్ లో ఈ తప్పుడు ఆరోపణ మరింత బలంగా ఎల్లో మీడియా ద్వారా హైలైట్ అవుతోంది. అయితే వాస్తవాలు మరోలా ఉన్నాయి. చంద్రబాబు హయాంలోనే అప్పులు పెరిగాయి, ఆర్థిక క్రమశిక్షణ లేక పథకాల అమలు సాధ్యం కాలేదు. జగన్ హయాంలో ఆర్థిక క్రమశిక్షణ ఉంది కాబట్టే ఈ పథకాలన్నీ అమలవుతున్నాయి.

2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర అప్పు రూ. 1.18 లక్షల కోట్లు

2019లో ఆయన అధికారం నుంచి దిగిపోయేనాటికి అప్పు రూ. 2.71 లక్షల కోట్లు

అంటే చంద్రబాబు అప్పులు పెంచారే కానీ తగ్గించలేదు.

పవర్‌ సెక్టార్‌ కార్పొరేషన్‌లో.. చంద్రబాబు రాకముందు రుణాలు రూ.29వేల కోట్లు ఉంటే, బాబు వాటిని రూ.69 వేల కోట్లకు తీసుకెళ్లారు. జగన్ హయాంలో ఆ రుణాలను రూ.1.06 లక్షల కోట్లకు పరిమితం చేశారు. పే బిల్స్‌ ఆన్‌ ఎకౌంట్‌ ఆఫ్‌ పవర్‌ పర్చేజస్‌ చూస్తే.. బాబు హయాంలో రూ.21వేల కోట్లకు ఎగబాకితే జగన్ హయాంలో రూ.8,500 కోట్లకు అవి తగ్గాయి. నాన్‌ గ్యారంటీడ్‌ పవర్‌ లయబులిటీస్‌ విషయానికొస్తే బాబు హయాంలో అవి రూ.81 వేల కోట్లకు పెరిగాయి. జగన్ హయాంలో రూ.69వేల కోట్లకు తగ్గాయి.

మొత్తం రాష్ట్ర ప్రభుత్వ లయబిలిటీస్‌ అండ్‌ నాన్‌ గ్యారెంటీ పీఎస్‌యూ లయబిలిటీస్‌ లెక్క తీస్తే చంద్రబాబు హయాంలో రూ.1.53 లక్షల కోట్లనుంచి అవి రూ.4.12 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే రెట్టింపుకంటే అధికం అనమాట. జగన్ హయాంలో కూడా అవి పెరిగాయి కానీ రూ.7.03 లక్షల కోట్ల దగ్గర ఆగాయి.

చంద్రబాబు తన హయాంలో ఉచిత పథకాలకంటే అభివృద్ధికోసం మూలధన వ్యయంలో ఎక్కువ ఖర్చు చేశానని చెప్పేవారు. అయితే అది కూడా అసత్యమే. జగన్ హయాంలో కేవలం బటన్ నొక్కే కార్యక్రమాలే కాదు. నాడు-నేడుతో స్కూళ్లు బాగుపడ్డాయి. ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారాయి. సచివాలయ భవనాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ ల పేరుతో గ్రామాలకు కొత్త భవనాలు ఆస్తులుగా మారాయి. రాష్ట్రంలో కొత్త పోర్ట్ లు కడుతున్నారు. 10 ఫిషింగ్ హార్బర్లు అందుబాటులోకి తెస్తున్నారు. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నారు. ఇదంతా కేపిటల్ ఎక్స్ పెండిచర్ కాదా..? దీనికి సమాధానం బాబు దగ్గర లేదు. బాబు హయాం కేపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ కింద ఏడాదికి రూ.15,227 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ హయాంలో అది రూ.17,757 కోట్లకు పెరిగింది. అంటే అభివృద్ధి కార్యక్రమాలకోసం బాబు కంటే జగన్ ఎక్కువ ఖర్చు పెడుతున్నారనమాట.

పైగా చంద్రబాబు పాలనకు, జగన్ కి ఒక పెద్ద తేడా ఉంది. జగన్ అధికారంలోకి వచ్చాక కొవిడ్ తో ప్రపచం అల్లాడిపోయింది, అలాంటి గడ్డు పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ ఒక్క పథకం కూడా ఆపకుండా పాలన కొనసాగించారు జగన్. ఆ విషయంలో నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాలని అంటారు ఆర్థిక నిపుణులు.

GSDP విషయానికొస్తే, బాబు హయాంలో 4.47 శాతం GSDP ఉంటే, జగన్ హయాంలో 4.83 శాతంగా ఉంది. అంటే ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలు ఓ అంచనాకు రావొచ్చు. జగన్ హయాంలో పన్నులు పెరిగాయని టీడీపీ మరో ప్రధాన ఆరోపణ చేస్తోంది. బాబు హయాంలో ట్యాక్స్‌ బర్డెన్‌ 6.57 శాతం అయితే, జగన్‌ హయాంలో అది 6.35 శాతమే. అంటే పన్నులు కూడా జగన్ హయాంలోనే తక్కువ.

ఈ గణాంకాలన్నీ ఎల్లో మీడియా చూపించదు, చంద్రబాబు కూడా వీటిని ప్రస్తావించరు. కేవలం బురదజల్లడమే వారి పని. జగన్ పన్నులు పెంచారు, జగన్ అప్పులు చేశారు, అందుకే జగన్ పథకాలు అమలు చేస్తున్నారు.. ఇవే వారి ఆరోపణలు. కానీ వాస్తవంగా చంద్రబాబు కంటే జగన్ చేసిన అప్పులు తక్కువ, చంద్రబాబు కంటే జగన్ వేసిన పన్నులు తక్కువ, కేపిటల్ ఎక్స్ పెండిచర్ బాబు హయంలో తక్కువ, జగన్ హయాంలో ఎక్కువ. అంటే సంక్షేమం, అభివృద్ధి.. రెండిటికీ సమపాళ్లలో న్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్. ఆ విషయంలో దారుణంగా విఫలమైన నాయకుడు చంద్రబాబు. ఆ ఇద్దరికీ అదే తేడా. 

Tags:    
Advertisement

Similar News