నువ్వేమైనా పుడింగా.. నీ బట్టలూడదీస్తా.. సీనియర్ల కొట్లాట

ఇద్దరు సీనియర్లు గతంలో తిట్టుకున్నా, ఈ స్థాయిలో ఎప్పుడూ పరుష పదజాలం ఉపయోగించలేదు. కానీ ఇప్పుడు పెద్దిరెడ్డి, చంద్రబాబు.. బట్టలూడదీస్తామంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Advertisement
Update:2023-01-06 07:01 IST

ప్రతిపక్ష నేత చంద్రబాబు వయసు 72 సంవత్సరాలు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వయసు 69ఏళ్లు..

దాదాపుగా ఇద్దరూ సమకాలికులే, ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు, ఒకే పార్టీకోసం పనిచేశారు. ఆ తర్వాత ఎవరి దారులు వారివయ్యాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇద్దరూ బద్ధశత్రువులుగా మారారు. ఆధిపత్య పోరు తొలినుంచీ ఉన్నా.. ప్రస్తుతం చిత్తూరులో పెద్దిరెడ్డిదే పైచేయి. వచ్చేసారి కుప్పంలో కూడా చంద్రబాబు కూసాలు కదిల్చేలా ఉన్నారు పెద్దిరెడ్డి. ఆ రేంజ్ లో గ్రౌండ్ వర్క్ జరుగుతోంది.

ఇవేం తిట్లు..

చంద్రబాబు, పెద్దిరెడ్డి.. ఎన్నో తరాల రాజకీయం చూశారు, ఎంతోమంది సీనియర్లతో కలసి పనిచేశారు. కానీ ఈ జనరేషన్ తిట్లకు వారు పెద్దగా అలవాటు పడలేదు. కానీ టైమ్ వచ్చేసింది. సీనియర్లు కూడా చిల్లర తిట్లు అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఇప్పుడు చిత్తూరు కేంద్రంగా ఇద్దరూ ఒకరిపై ఒకరు తిట్ల వర్షం కురిపించుకుంటున్నారు. కుప్పంలో చంద్రబాబు రోడ్ షో కి బ్రేక్ పడిన తర్వాత ఈ మాటలు మరింత ఘాటుగా మారాయి.

పుంగనూరు పుడింగి..

పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి ఒక్క విషయం గుర్తు పెట్టుకో అంటూ చంద్రబాబు కుప్పంలో ఆవేశంగా మాట్లాడారు. "పుంగనూరులో నీ కథ తేల్చేస్తా, ఇది బిగినింగ్ మాత్రమే, 14 ఏళ్లు నేను అనుకుని ఉంటే ఈ జిల్లాలో తిరిగి ఉండే వాడివా? నీఇష్ట ప్రకారం అరాచకాలు చేస్తావా, నీ డెయిరీకి మాత్రమే పాలు పోయాలా? నీ తాత జాగీరా ఇది ఖబడ్డార్, నిన్ను చూస్తే అసహ్యం వేస్తోంది. కుప్పం పంచాయితీ ఎన్నికలు కాదు. ఇప్పుడు రా నీ సంగతేంటో కుప్పంలో చూస్తాను." అంటూ చంద్రబాబు చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నీ బట్టలూడదీస్తా..

చంద్రబాబు తన బట్టలూడదీస్తానంటున్నారని, వైసీపీ నేతలే ఆయన బట్టలు ఊడదీసి కుప్పం స్థానిక ఎన్నికల్లో ఘోరంగా ఓడించారని విమర్శించారు పెద్దిరెడ్డి. వార్డు మెంబర్ కంటే దిగజారి చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు పుడింగి అంటే చంద్రబాబుకి అర్థం తెలుసా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుమార్తెను పెళ్లి చేసుకున్న తర్వాత కుప్పంలో అభ్యర్థి చేత రాజీనామా చేయించి చంద్రబాబు గెలిచారని చెప్పుకొచ్చారు పెద్దిరెడ్డి. కుప్పంలో చంద్రబాబు బతుకు తెల్లారిపోయిందని, ఆయన బట్టల్ని ఎప్పుడో జగన్ ఊడదీసేశారని అన్నారు. తాను దయదలిస్తేనే చంద్రబాబు కుప్పంలో తిరగగలుగుతున్నారని అన్నారు. చంద్రబాబుని గాడిద కొడకా అని అంటే గాడిదలు ఇంటి దగ్గరకు వచ్చి ఆందోళన చేస్తాయని, ఇలాంటి బిడ్డను కన్నందుకు అవి సిగ్గు పడతాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు పెద్దిరెడ్డి. కుప్పంలో ఈసారి ఎలా గెలుస్తావో నేనూ చూస్తానని శపథం చేశారు.

ఇద్దరు సీనియర్లు గతంలో తిట్టుకున్నా, ఈ స్థాయిలో ఎప్పుడూ పరుష పదజాలం ఉపయోగించలేదు. కానీ ఇప్పుడు పెద్దిరెడ్డి, చంద్రబాబు.. బట్టలూడదీస్తామంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Tags:    
Advertisement

Similar News