మంత్రులకు శిక్షణ.. బాబు మార్కు ఇదేనా..?

ఎంబీఏ సహాయకుల పేరుతో మంత్రుల వ్యవహారాలన్నీ, చంద్రబాబు తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

Advertisement
Update:2024-06-13 08:54 IST

చంద్రబాబు పాలన అంటే కచ్చితంగా హడావిడి ఉంటుంది. సింపుల్ గా జరిగే పనులకు కూడా ఎక్కడలేని ప్రచారం, ప్రాముఖ్యత ఉంటాయి. ఏ చిన్న సమస్య వచ్చినా వార్ రూమ్ లు, స్పెషల్ టీమ్ లు, 24గంటల సమీక్షలు అంటూ హడావిడి చేస్తారు చంద్రబాబు. ఇక శిక్షణా కార్యక్రమాలకు లెక్కే లేదు. ఉద్యోగాలు చేస్తున్న వారినికూడా శిక్షణ పేరుతో సతాయిస్తుంటారనే అపవాదు ఆయనపై ఉంది. తాజాగా ఆయన పాత పద్ధతుల్ని మళ్లీ తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రులకు శిక్షణ అంటూ ఆయన తొలి మీటింగ్ లోనే ప్రకటించడం విశేషం.

కొత్త మంత్రులయినా, పాత మంత్రులయినా.. రోజులు గడిచేకొద్దీ, అధికారుల దగ్గర సమాచారం తెలుసుకుని పనిలోపడతారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తామని చెబుతున్నారు. ఆయా శాఖల్లో ఫైళ్లు ఎలా నిర్వహించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలపై శిక్షణ ఉంటుందని అంటున్నారు. ఇక మంత్రులకు సహాయకులుగా ఎంబీఏ చదివిన వారిని నియమిస్తామని కూడా చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన ఓఎస్డీలు, ఇతర అధికారుల్ని తిరిగి నియమించుకోవద్దని తేల్చి చెప్పారు. ఎంబీఏ సహాయకుల పేరుతో మంత్రుల వ్యవహారాలన్నీ, చంద్రబాబు తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం అనంతరం.. నూతన మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు చంద్రబాబు. తమ పనితీరు ద్వారా ఆయా శాఖలకు వన్నె తేవాలని ఉపదేశమిచ్చారు. యువకులు, ఉత్సాహవంతులు తమ ముద్ర వేయాలనుకుంటారు కానీ, చంద్రబాబు వారికి ఆ అవకాశం ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. చంద్రబాబు హయాంలో మంత్రులు సొంత నిర్ణయాలు తీసుకోగలరో లేదో వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News