బాబు కామెడీ.. రెండో సంతకం దానిపైనే
మొదటి సంతకమే పెద్ద కామెడీ అనుకుంటే, ఇప్పుడు రెండో సంతకం కూడా ప్రకటించేశారు చంద్రబాబు.
చంద్రబాబు మళ్లీ కామెడీ మొదలు పెట్టారు. తాను సీఎం అయిపోయినట్టు, వరుసబెట్టి సంతకాలు పెడుతున్నట్టు కలలు కంటున్నారు. మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై అని ఇటీవల స్టేట్ మెంట్ ఇచ్చారు బాబు. ఆయన సంతకం పెట్టేందుకు ఓ మహిళా అభిమాని పెన్ను కూడా బాబుకి బహూకరించడం మరో విశేషం. ఇక్కడికే ఈ కామెడీ ఎక్కువైంది అనుకుంటే, ఇప్పుడు రెండో సంతకం అంటూ హడావిడి మొదలైంది. చంద్రబాబు తన రెండో సంతకాన్ని కూడా ప్రకటించేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెడతానన్నారు బాబు.
తుస్సుమన్న మేనిఫెస్టో..
చంద్రబాబు మేనిఫెస్టో తుస్సుమంది. సూపర్ సిక్స్ కి కొనసాగింపుగా కూటమి మేనిఫెస్టో అంటూ బాబు, పవన్ ఫొటోలు ప్రింట్ చేసి మరీ హామీలను ప్రకటించారు. అయితే ఇందులో ఉన్నవన్నీ జగన్ ఈపాటికే అమలు చేస్తున్నవి కావడం విశేషం. జగన్ ఇస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచి ఇస్తామని మాత్రమే చంద్రబాబు చెప్పారు తప్ప ఆయన కొత్తగా తెరపైకి తెచ్చిన పథకాలేవీ లేవు. కర్నాటక, తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలనుంచి కాపీ కొట్టిన మహిళల ఉచిత రవాణా, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలపై కూడా ప్రజల్లో ఆసక్తి కనపడటం లేదు. అందుకే సంతకాలంటూ బాబు కామెడీ మొదలు పెట్టారు. మొదటి సంతకం, రెండో సంతకం అంటూ తాను అధికారంలోకి వచ్చినట్టే కలలు కంటున్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో టీడీపీ విషప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. దీనిపై ఇప్పటికే సీఎం జగన్ వివరణ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి అర్థం తెలుసా బాబూ అని ప్రశ్నించారు. జగన్ కి భూములు ఇవ్వడం తెలుసు కానీ, లాక్కోవడం తెలియదన్నారు. ఈ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఈ తప్పుడు ప్రచారాన్ని పరాకాష్టకు చేర్చారు బాబు. తన రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ యాక్ట్ రద్దుపైనే అని అంటున్నారు.