విదేశాలకు వెళ్లేందుకు పర్మిషన్‌ కోసం సీబీఐ కోర్టులో జగన్‌ పిటిషన్

విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి సీబీఐ కోర్టులో ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్ పిటిషన్‌ దాఖలు చేశారు.

Advertisement
Update:2025-01-03 20:17 IST

ఏపీ మాజీ సీఎం విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి సీబీఐ కోర్టు పిటిషన్‌ దాఖలు చేశారు.ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబసమేతంగా యూకేకు వెళ్లనున్నట్లు పిటిషన్‌లో వివరించారు. కాగా జగన్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్‌.. ఎప్పుడు విదేశాలకు వెళ్లాలన్న సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే, అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం రెండుసార్లు విదేశాలకు వెళ్లొచ్చారు. ముందుగా మే 16వ తేదీ నుంచి జూన్‌ 1వ తేదీ మధ్యలో లండన్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ దేశాల్లో ఆయన పర్యటించి వచ్చారు. అనంతరం తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 3 నుంచి 25వ తేదీ వరకు యూకే వెళ్లేందుకు కూడా సీబీఐ అనుమతినిచ్చింది. ఇప్పుడు తాజాగా మూడోసారి కుటుంబసమేతంగా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును జగన్‌ ఆశ్రయించారు.దీనిపై త్వరలో విచారణ జరగాల్సి ఉంది. అయితే సీబీఐ తీసుకునే నిర్ణయం ఇక్కడ మరోసారి కీలకంగా మారనుంది.

Tags:    
Advertisement

Similar News