ఈనెల 8న వైజాగ్ కు ప్రధాని మోదీ
రోష్ షోలో పాల్గొననున్న ప్రధాని
Advertisement
ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 8వ తేదీన వైజాగ్ రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి మోదీ విశాఖకు చేరుకుంటారు. నేరుగా సిరిపురం జంక్షన్ కు చేరుకొని అక్కడి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు నిర్వహించే రోష్ షోలో ప్రధాని పాల్గొంటారు. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతారు. ఈ సందర్భంగా ఏపీలో చేపట్టబోయే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. రాత్రి 7 గంటలకు తిరిగి భువనేశ్వర్ కు బయల్దేరి వెళ్తారు. ప్రధాని మోదీ పర్యటన ఖరారైన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Advertisement