వైజాగ్ సెంట్రల్ జైలులో గంజాయి కలకలం
విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి దొరకడం తీవ్ర కలకలం రేపుతుంది.
విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి దొరకడం తీవ్ర కలకలం రేపుతుంది. జైలులో గంజాయి దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఖైదీలే ఇక్కడ గంజాయి సాగు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జైలు సూపరింటెండెంట్ మార్పు జరిగింది. ఇక, ఏదీ జరిగినా హోం మంత్రి అనిత.. గత ప్రభుత్వంపైకి నెట్టేస్తున్నారు. అయితే, విశాఖ సెంట్రల్ జైలులో నిఘా కొరవడినట్టు ప్రత్యక్షంగానే తెలుస్తోంది. ఈ నేపధ్యంలో విశాఖ జైలులో హోంమంత్రి వంగలపూడి అనిత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైలులో సెల్ ఫోన్లు బయటపడటంపై విచారణ సాగుతోందన్నారు. ఫోన్లు ఎవరు వినియోగిస్తున్నారో త్వరలో తేల్చుతున్నామన్నారు. జైలులో గంజాయి మొక్క కనిపించిందని చెప్పారు. ఖైదీలకు గంజాయి సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. తనిఖీల్లో కొన్ని విషయాలు తెలిశాయని చెప్పారు.
సిబ్బందిని తనిఖీలు చేసిన బారక్‌ను కూడా చూశానని చెప్పారు. పోలీసు సిబ్బంది ఎలాంటి వివక్ష ఉందన్నారు. తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టామన్నారు. సిబ్బందికి చెడ్డపేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం మూడు సెల్ ఫోన్లను అధికారులు గుర్తించారు. సిమ్ కార్డులేని మొబైల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యారక్ సమీపంలోని పూల కుండీ వద్ద భూమిలో నాలుగు అడుగల లోతున ఫోన్లను పాతిపెట్టారు. ఫోన్లను ప్యాక్ చేసి గుంతలో దాచిపెట్టారు. రెండు రాళ్లు కప్పి పైన పూల కుండీ పెట్టారు. దీంతో, సెల్ ఫోన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో అధికారులు రంగంలోకి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.