హామీలు ఇచ్చినప్పుడు తెలియదా నిధులు లేవని : శ్యామల
హామీలు ఇచ్చినప్పుడు డబ్బులు లేవని తెలియదా? ఇప్పుడు నిధులు లేవని ఎలా చెప్తారు? అని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత శ్యామల ఫైర్ అయ్యారు.
ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత శ్యామల మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఏమైందని శ్యామల ప్రశ్నించింది. మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని శ్యామల ఆరోపించారు. తల్లికి వందనం’ పథకం కోసం విద్యార్థులు, తల్లులు ఎదురు చూస్తున్నారని వైసీపీ నేత శ్యామల అన్నారు. ఆ పథకం ఎందుకు ఇవ్వట్లేదని జనం మధ్యలోకి వచ్చి టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలని ఆమె సవాల్ విసిరారు. 2025 జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రి లోకేశ్‌ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ‘‘మహిళలకు ఉచిత బస్సు పథకం లేదు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు. సూపర్ సిక్స్ పేరుతో జనాలను బాబు నిలువునా మోసం చేశారు.
హామీలు ఇచ్చినప్పుడు డబ్బులు లేవని తెలియదా? ఇప్పుడు నిధులు లేవని ఎలా చెప్తారు? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.‘దీపం పథకం ఏమైందో చంద్రబాబు చెప్పాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏమైందో చంద్రబాబు చెప్పాలి. కూటమి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. నమ్మించి.. మాటిచ్చి.. ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం బాబుకు అలవాటే. రూ.74 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని లెక్క తెలిసినా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు డబ్బుల్లేవని ఎలా చెప్తారు?. ‘‘ఇప్పుడు గనుక జగన్ మోహన్‌రెడ్డి ఉండి ఉంటే..’’ అని రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నారు. ఈ హామీల అమలుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది’’ అని స్పష్టం చేశారామె.ఈ క్రమంలో హామీల పేరుతో ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు చేసిన హడావిడిని.. ప్రకటనలను వీడియో రూపంలో శ్యామల మీడియాకు ప్రదర్శించారు.