పుష్ప' స్టైల్‌లో నితీశ్ రెడ్డి సంబరం.. అంబటి ట్వీట్ వైరల్
నితీశ్ రెడ్డి సెలబ్రేషన్స్ తాలూకు వీడియోను పంచుకుంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు.
భారత్, ఆసీస్ మధ్య మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి అజేయ సెంచరీతో ఆకట్టుకున్నా విషయం తెలిసిందే. అయితే, అంతకుముందు అతని హాఫ్ సెంచరీ సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పుష్ప స్టైల్లో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ ను అనుకరించాడు. కాగా, వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. నితీశ్ రెడ్డి సెలబ్రేషన్స్ తాలూకు వీడియోను పంచుకుంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. రేవంత్ సర్కార్‌పై పరోక్షంగా ఆయన సెటైర్లు వేశారు. "ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న పుష్ప హీరోను వేధిస్తూ టాలీవుడ్ మూవీని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానంటే నమ్మేదెలా అబ్బా" అని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల తెలంగాణలో జరిగిన పరిణామాలపైన ఆయన వ్యంగ్యంగా ఈ ట్వీట్ చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. సీనియర్లంతా నిరాశపర్చినా ఆసీస్ బౌలర్లను ఆడుకున్నాడు. ఒక సిక్స్, 9 ఫోర్లతో సెంచరీతో కదం తొక్కాడు. దీంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అతడు అర్ధ శతకం నమోదు చేసిన సమయంలో పుష్ప స్టైల్లో ‘తగ్గేదేలే’ అంటూ మేనరిజంతో సంబురాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌కు నితీశ్ వీడియోని కూడా షేర్ చేశారు.