బీజేపీ సేఫ్ గేమ్ వర్కవుటవుతుందా?
అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీని కాదని బీజేపీ గెలుచుకునే సీట్లేమీ ఉండవు. అలాగే మిత్రపక్షం జనసేన పరిస్దితి కూడా డిటోనే. మహా అయితే కాపులందరూ ఏకమై ఓట్లేస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడైనా గెలుస్తారేమో చెప్పలేం. ఈ మాత్రం దానికి ఊరికే ఆయాసపడే బదులు 2029 ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకుంటే సరిపోతుందని బీజేపీ ఆలోచిస్తోంది.
భీమవరంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమవేశం తర్వాత బీజేపీ ఆలోచనలపై స్పష్టత వచ్చిందా? అందరికీ అలాగే అనిపిస్తోంది. ఇంతకీ ఆ స్పష్టత ఏమిటంటే సేఫ్ గేమ్ ఆడాలని డిసైడ్ చేసుకున్నట్లు తెలిసిపోతోంది. బీజేపీ టార్గెట్ 2024 ఎన్నికలు కాదని 2029 ఎన్నికలు మాత్రమే అని సమావేశంలో జరిగిన చర్చలను బట్టి అర్ధమవుతోంది. తల్లకిందులుగా తపస్సుచేసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లలో కూడా గెలిచే అవకాశం లేదని అందరికీ తెలుసు.
అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీని కాదని బీజేపీ గెలుచుకునే సీట్లేమీ ఉండవు. అలాగే మిత్రపక్షం జనసేన పరిస్దితి కూడా డిటోనే. మహా అయితే కాపులందరూ ఏకమై ఓట్లేస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడైనా గెలుస్తారేమో చెప్పలేం. ఈ మాత్రం దానికి ఊరికే ఆయాసపడే బదులు 2029 ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకుంటే సరిపోతుందని బీజేపీ ఆలోచిస్తోంది. ఎలాగంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ భవిష్యత్తు తేలిపోతుంది. గెలిస్తే ఓకేనే ఓడిపోతే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ కనిపించదు.
అప్పుడు వైసీపీ మాత్రమే మిగిలుంటుంది. కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను తాను పోషించవచ్చని బీజేపీ అనుకుంటుంది. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏపీలో జగన్ ప్రభుత్వానికి చికాకు కలిగించటం ద్వారా ఇబ్బందుల్లోకి నెట్టేయచ్చన్నది బీజేపీ ఆలోచన. అప్పుడు జగన్ పాలనను నెగిటివ్‌గా ప్రచారం చేసి జనాలను ఆకట్టుకోవాలన్నది కమలనాథుల వ్యూహం. అప్పుడు ఎలాగూ ఫైట్ వైసీపీ - బీజేపీ మధ్య మాత్రమే ఉంటుంది కాబట్టి జనాలకు కూడా జగన్‌పైన భ్రమలు తొలగిపోయి బీజేపీ వైపు వస్తారని అంచనాలు వేసుకుంటుంది.
అయితే 2029 ఎన్నికల వరకు వెయిట్ చేసేంత ఓపిక పవన్‌లో కనిపించటం లేదు. రాబోయే ఎన్నికల్లోనే టీడీపీతో పాటు జనసేన భవిష్యత్తు కూడా తేలిపోతుంది. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు కనీసం ఓ నలుగురిని అయినా గెలిపించుకోకపోతే జనసేన చాప్టర్ ఖతమేని పవన్‌కు బాగా తెలుసు. బీజేపీకి ఇపుడున్నదేమీ లేదు కాబట్టే కొత్తగా పోయేదేమీ లేదు. అందుకనే బీజేపీ సేఫ్ గేమ్‌తో పవన్ విభేదిస్తున్నట్లున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.