13లో రెండు సీట్లేనా..?.. ప‌వ‌న్‌ అంటే బాబుకు ఇంత చిన్న‌చూపా..?

మారుతున్న సమీకరణల నేపథ్యంలో నెల్లూరు, ఒంగోలు, కడప స్థానాలను పెండింగ్‌లో ఉంచారు. మరో వైసీపీ ఎంపీకి కూడా టీడీపీ నుంచి టిక్కెట్‌ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

Advertisement
Update:2024-02-01 11:30 IST

అనుకున్నట్టుగానే టీడీపీ- జనసేన పొత్తులో గాజుగ్లాసు పార్టీకి పెద్దగా ప్రాధాన్యం కనిపించడం లేదు. ఎన్నికల షెడ్యూల్‌కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో 25 లోక్‌సభ స్థానాలకు గాను 13 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ-జనసేన కూటమి. అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా అభ్యర్థిత్వాలపై పార్టీల్లో స్పష్టత వచ్చినట్లు సమాచారం. అయితే 13 స్థానాల్లో టీడీపీ 11 తీసుకుంది. జనసేనకు రెండు స్థానాలు మాత్రమే కేటాయించారు. ముగ్గురు వైసీపీ సిట్టింగులకు వారిస్థానాల్లోనే తిరిగి సీట్లు కేటాయించారు. మిగిలిన సీట్లపై కసరత్తు కొనసాగుతోంది. మారుతున్న సమీకరణల నేపథ్యంలో నెల్లూరు, ఒంగోలు, కడప స్థానాలను పెండింగ్‌లో ఉంచారు. మరో వైసీపీ ఎంపీకి కూడా టీడీపీ నుంచి టిక్కెట్‌ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్లే:

రఘురామకృష్ణంరాజు- నరసాపురం- టీడీపీ

లావు శ్రీకృష్ణదేవరాయలు- నరసరావుపేట- టీడీపీ

శ్రీకాకుళం- రామ్మోహన్‌నాయుడు- టీడీపీ

హిందూపురం- బీకే పార్థసారథి- టీడీపీ

అనంతపురం - కాల్వశ్రీనివాసులు- టీడీపీ

అనకాపల్లి- బైరి దిలీప్ చక్రవర్తి- టీడీపీ

విశాఖపట్నం- మెతుకుపల్లి భరత్ - టీడీపీ

విజయవాడ- కేశినేని చిన్ని- టీడీపీ

ఏలూరు- గోపాల్ యాదవ్- టీడీపీ

తిరుపతి(ఎస్సీ)- అంగలకుర్తి నిహారిక- టీడీపీ

రాజంపేట- సుగవాసి బాలసుబ్రహ్మణ్యం- టీడీపీ

మచిలీపట్నం- వల్లభనేని బాలశౌరి- జనసేన

కాకినాడ- సానా సతీష్ కుమార్ - జనసేన

మిగిలిన సీట్లలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. విజయనగరం ఎంపీ సీటు కోసం వెంకటేశ్‌, కంది చంద్రశేఖర్‌ మధ్య పోటీ నడుస్తోంది. రాజమహేంద్రవరం సీటు రేసులో మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు ఉన్నారు. ఆయన కాని పక్షంలో బొడ్డు వెంకటరమణ, గన్ని కృష్ణ, లోహిత్‌ పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. అమలాపురానికి మాజీ స్పీకర్‌ బాలయోగి కుమారుడు గంటి హరీశ్‌ పేరు ఖరారైనా.. మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావు కుమార్తె తనకు ఆసక్తి ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. గుంటూరుకు ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్‌ పేరు గతంలోనే ఖరారైంది. కానీ, ఎన్నారైలకు ఇవ్వడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడంతో ప్రత్యామ్నాయంగా భాష్యం రామకృష్ణ పేరును పరిశీలిస్తున్నారు. బాపట్ల స్థానానికి తీవ్ర పోటీ ఉంది. హరిప్రసాద్‌, ఉండవల్లి శ్రీదేవి, పనబాక లక్ష్మి, ఎంఎస్‌ రాజు, పాలపర్తి మనోజ్‌కుమార్‌ రేసులో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News