10 పరీక్షల్లో బాలికలదే పైచేయి.. మన్యం టాప్, కర్నూలు లాస్ట్

ఫలితాలు ఈసారి రికార్డ్ టైమ్ లోనే విడుదల చేశామన్నారు అధికారులు. విద్యాసంవత్సరం ముగియకముందే ఫలితాలు విడుదలయ్యాయి.

Advertisement
Update:2024-04-22 12:02 IST

ఏపీలో టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చేశాయి. ఉత్తీర్ణత శాతంలో బాలికలదే ఈసారి కూడా పైచేయి. అయితే బాలురతో పోల్చి చూస్తే బాలికలు దాదాపు 5 శాతం ఎక్కువమంది ఉత్తీర్ణులు కావడం ఇక్కడ విశేషం. మొత్తంగా 7 లక్షలమంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందులో 6.23 లక్షలమంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు. వీరిలో 86.69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

ఉత్తీర్ణత శాతం 86.69 శాతం

బాలురు 84.32 శాతం

బాలికల ఉత్తీర్ణత శాతం 89.17

93.7 శాతం ఫలితాలతో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలోనే టాప్ ప్లేస్ లో నిలిచింది. కర్నూలు జిల్లా మాత్రం కేవలం 67 శాతం ఫలితాలు సాధించడం విశేషం. ఫలితాల్లో కర్నూలుదే చివరి స్థానం. రాష్ట్రవ్యాప్తంగా 2,300 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. రాష్ట్రంలోని 17 స్కూళ్లలో ఒక్కరంటే ఒక్కరూ పది పాస్ కాలేదు.

విజయవాడలో టెన్త్‌ ఫలితాలను విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేశారు. ఫలితాలు ఈసారి రికార్డ్ టైమ్ లోనే విడుదల చేశామన్నారు అధికారులు. విద్యాసంవత్సరం ముగియకముందే ఫలితాలు విడుదలయ్యాయి. మే 24 నుంచి జూన్‌ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News