అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతాం

సహకారం కోసం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లతో భేటీ అయిన ఏపీ మంత్రి నారా లోకేశ్‌

Advertisement
Update:2024-10-29 08:35 IST

ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో మంత్రి లోకేశ్‌ పర్యటన కొనసాగుతున్నది. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలతో భేటీ అయిన ఆయన .. తాజాగా మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లతో సమావేశమయ్యారు. ఏపీలో ఐటీ, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ఆయనతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో డిజిటల్‌ గవర్నెన్స్‌కు సాంకేతిక సహకారం అందించాలని కోరారు. అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దడానికి సహకరించాలని ప్రతిపాదించారు. ఏపీని సందర్శించాలని ఈ సందర్భంగా సత్య నాదేళ్లను లోకేశ్‌ ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సత్య నాదేళ్ల మాట్లాడుతూ.. సాఫ్ట్‌వేర్‌తో పాటు క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఎంటర్‌ప్రైజ్‌ టెక్నాలజీ రంగాల్లో మైక్రోసాఫ్ట్‌ సంస్థ గ్లోబల్‌ లీడర్‌గా ఉందన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ వరకు మైక్రోసాఫ్ట్‌ 3.1 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌గా ఉందన్నారు. 2023లో మైక్రోసాఫ్ట్‌ 211.9 బిలియన్‌ డాలర్ల ఆదాయం ఆర్జించిందన్నారు.

అనంతరం మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. సాంకేతిక రంగంలో ఏపీని అగ్రగామిగా మార్చడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్‌ పార్కులు నిర్మిస్తున్నాం. ఐటీ హబ్‌లను ప్రపంచస్థాయి కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్‌ సహకారం అవసరం అన్నారు. ప్రపంచస్థాయి సంస్థలకు ఏపీ ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌, డేటా సెంటర్ల ఏర్పాటుతో ఏపీకి మరిన్ని అవకాశాలు వస్తాయి. పెట్టుబడి అనుకూల విధానాలు, భూమి మా వద్ద ఉన్నాయని తెలిపారు. క్లౌడ్‌ సేవల్లో మైక్రోసాఫ్ట్‌ నాయకత్వంతో కలిసి వెళ్లాలని.. అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తున్నామన్నారు. అగ్రిటెట్‌కు ఏఐ అనుసంధానంతో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. ఉత్పాదకతను పెంచే సాగు విధానాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

లోకేశ్‌ ప్రతిపాదనపై కంపెనీ సహచరులతో చర్చిస్తా: అడోబ్‌ సీఈవో

అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్‌ అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌తో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులు పెట్టడానికి ఏపీలో అన్నివిధాలా అనుకూలమని మంత్రి వివరించారు. దీనిపై స్పందించిన శంతను నాయాయణ్‌ డిజిటల్‌ మీడియా, క్లౌడ్‌ ఆధారిత సేవల్లో అడోబ్‌ అగ్రగామి ఉన్నది. ఫొటోషాప్‌, అక్రోబాట్‌, ఇల్లస్ట్రేటర్‌ వంటివి అందుబాటులోకి తెచ్చామన్నారు. ఏఐ-పవర్డ్‌ ఇన్నోవేషన్స్‌ రంగంలో అప్‌డేటెడ్‌ వర్షన్‌ను తెస్తున్నామన్నారు. మంత్రి లోకేశ్‌ ప్రతిపాదనపై కంపెనీ సహచరులతో చర్చిస్తామని, ఏపీ పెట్టుబడుల అంశాన్ని పరిశీలిస్తామన్నారు. 

Tags:    
Advertisement

Similar News