బోసిడీకే వర్సెస్ ఎర్రిపప్ప..

పప్ప అంటే హిందీలో నాన్న అనే అర్థముందని, ఎర్రిపప్ప అనగా పిచ్చినాన్న అనే అర్థం వస్తుందని వివరించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.

Advertisement
Update:2023-05-08 22:10 IST

ఏపీలో ఎర్రిపప్ప రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఓ యువరైతుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎర్రిపప్ప అని తిట్టేశారు. ఆ తర్వాత ఆయన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి. బాధిత రైతుల్ని ఎవరైనా ఎర్రిపప్ప అంటారా అంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీంతో మంత్రి కవరింగ్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. తమ మాండలికంలో ఎర్రిపప్ప అనడం సహజమన్నారు.

అసలు ఎర్రిపప్ప అంటే ఏంటో తెలుసా..?

పప్ప అంటే హిందీలో నాన్న అనే అర్థముందని, ఎర్రిపప్ప అనగా పిచ్చినాన్న అనే అర్థం వస్తుందని వివరించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. తన మాటల్ని మీడియా పదే పదే చూపిస్తూ అపార్థం చేసుకునేలా ప్రయత్నించిందని మండిపడ్డారాయన. ఎర్రిపప్ప అనడం తప్పేం కాదని చెప్పుకొచ్చారు.

మరి బోసిడీకే..!

అప్పట్లో టీడీపీ నేత పట్టాభి బోసిడీకే అనే మాటతో పాపులర్ అయ్యారు. ఆ దెబ్బతో ఆయన జైలుకి కూడా వెళ్లొచ్చారు. టీడీపీ నేతలకు ఓ రూల్, వైసీపీ నేతలు మాట్లాడితే మరో రూలా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో కూడా మంత్రి కారుమూరిపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఎర్రిపప్ప అని తిట్టినందుకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి.. దానికి పిచ్చి నాన్న అనే అర్థం చెప్పి, ఆ తిట్టు అసలు తప్పేం కాదని అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం బోసిడీకే వర్సెస్ ఎర్రిపప్ప.. వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది

Tags:    
Advertisement

Similar News