ప్రతిపక్షాల గొంతు మేమెందుకు నొక్కుతాం –ఏపీ డీజీపీ

పోలీసులు నిర్దేశించిన ప్రకారం ఖాళీ ప్రదేశాల్లోనే బహిరంగ సభలు పెట్టుకోవాలని సూచించారు. ఇరుకైన ప్రదేశాల్లో సభలు పెట్టుకుంటూ, పోలీసులు అడ్డుకుంటున్నారని అభాండాలు వేస్తే కుదరదన్నారు.

Advertisement
Update:2023-03-01 21:25 IST

ఏపీ పోలీసులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. ప్రతిపక్షాల గొంతు తామెందుకు నొక్కుతామని ప్రశ్నించారాయన. పోలీసులు నిర్దేశించిన ప్రకారం ఖాళీ ప్రదేశాల్లోనే బహిరంగ సభలు పెట్టుకోవాలని సూచించారు. ఇరుకైన ప్రదేశాల్లో సభలు పెట్టుకుంటూ, పోలీసులు అడ్డుకుంటున్నారని అభాండాలు వేస్తే కుదరదన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నిబంధనలను అతిక్రమించి అనపర్తిలో సభ నిర్వహించడాన్ని తప్పుబట్టారు. అనపర్తి కేసులపై దర్యాప్తు వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఏపీలోని కాలేజీల్లో గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టామని, సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు డీజీపీ.

పనితీరు మెరుగుపడింది..

ఏపీలో పోలీసుల పనితీరు మెరుగుపడిందని, పోలీసులు బెనిఫిట్స్ గురించి ఎక్కువగా చింతించొద్దని, ప్రభుత్వం త్వరలోనే వాటిని పరిష్కరిస్తుందని చెప్పారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించిన ఆయన, పోలీసుల పనితీరు మెరుగుపడిందని అభినందించారు.

మహిళా పోలీసుల పనితీరు భేష్..

సచివాలయాల ద్వారా రిక్రూట్ అయిన మహిళా పోలీసులు డిపార్ట్ మెంట్ కి ఎంతో సపోర్ట్ అవుతున్నారని చెప్పారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. వారిని కూడా వివిధ సందర్భాల్లో పోలీస్ విధులకు ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. మహిళా పోలీస్ లు వచ్చిన తర్వాత గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు అక్కడికక్కడే పరిష్కారం అవుతున్నాయని అభినందించారు. గత ఏడాది కాలంలో 77వేల కేసులు తగ్గించామని తెలిపారు. ఏపీ పోలీస్ శాఖ సాధించిన ఘనత ఇది అని అన్నారు. పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగిందని, దిశ చట్టం వచ్చేలోపు ఆ స్ఫూర్తితో ముందుకు వెళుతున్నామని వివరించారు. ట్రాఫిక్ నిబంధనల విషయంలో కఠినంగా ఉండాలని, అయితే హెల్మెట్ లేని వారికి జరిమానాలు వేయకుండా కౌన్సిలింగ్ మాత్రమే ఇవ్వాలని సూచించారు.


Tags:    
Advertisement

Similar News