వారాహిపై రాళ్లు.. పవన్ కు టీడీపీ ఇచ్చిన సలహా..!

అభిమానుల్ని రప్పించుకుని, రాళ్లు వేయించుకుని, ప్రభుత్వంపై బురదజల్లేందుకు పవన్ కల్యాణ్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ నేతల సలహాతోనే పవన్ ఈ పని చేస్తున్నారని అన్నారు.

Advertisement
Update:2023-10-04 17:20 IST

పెడన సభలో తనపై రాళ్లు వేస్తారని, కొంతమంది క్రిమినల్స్ జనంలో కలసిపోయి విధ్వంసం సృష్టిస్తారని పవన్ కల్యాణ్ అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోప‌ణ‌లు చేసిన సంగతి తెలిసిందే. అసలు పవన్ సభపై రాళ్లేసే అవసరం తమకేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో పవన్ కి ఆల్రడీ పోలీసులు నోటీసులిచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ సభలో రాళ్లు వేసేది జనసైనికులేనని తేల్చి చెప్పారు.


అభిమానుల్ని రప్పించుకుని, రాళ్లు వేయించుకుని, ప్రభుత్వంపై బురదజల్లేందుకు పవన్ కల్యాణ్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ నేతల సలహాతోనే పవన్ ఈ పని చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడమే పవన్ ఉద్దేశమని చెప్పారు. పెడన సభలో ఏమైనా జరిగితే వైసీపీకి సంబంధం లేదన్నారు.

పెడనలో టెన్షన్..

పవన్ వ్యాఖ్యలు, వైసీపీ కౌంటర్లతో.. పెడనలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. స్వయానా అది మంత్రి జోగి రమేష్ సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ పవన్ వ్యాఖ్యలకు జనం ఎలా స్పందిస్తారనేది చూడాలి. గతంలో కూడా పవన్ ఇలాంటి ఆరోపణలే చేశారు, ఆ మాటకొస్తే ఆయనకు టీడీపీతో పొసగనప్పుడు చంద్రబాబు, లోకేష్ పై కూడా ఇలాంటి నిందలే వేశారు పవన్. ఇప్పుడు జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు. జగన్ మనుషులు పులివెందుల నుంచి వచ్చి పెడనలో విధ్వంసం సృష్టించబోతున్నారని నిందలు వేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పెడన సభపై ఫోకస్ పెట్టారు. ముందుగా పపవన్ కి నోటీసులిచ్చారు. అసలా సమాచారం ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలివ్వాలని కోరారు. ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు.. ఆ విధ్వంసకారకులు జనసైనికులేనంటూ తేల్చేసారు. పవన్ ఓ వ్యూహం ప్రకారమే ఇదంతా చేస్తున్నారని అన్నారు.

Tags:    
Advertisement

Similar News