భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి పేరు

ఏపీలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడుతూ అసెంబ్లీలో ప్రతిపాదన చేశారు.

Advertisement
Update:2024-11-21 20:26 IST

ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెడుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ మేరకు శాసన సభలో మంత్రి బీసీ జనార్ధనరెడ్డి కీలక ప్రతిపాదన చేశారు. దేశం కోసం పోరాడిన వీరుడిని గుర్తు చేసుకోవడం అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. గిరిజనుల పక్షాన బ్రిటీషర్స్ తో పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు పేరును ఎయిర్పోర్టుకు పెట్టడం వలన తెలుగు ప్రజల తరపున ఆయనకు సముచిత గౌరవం అందించినట్టు ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. కాగా ఈ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటన చేశారు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకొని కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు భోగాపురం ఎయిర్ పోర్టును ఆలస్యం చేశారని మండిపడ్డారు. ఏజెన్సీలో పోరాటం చేసిన అల్లూరి సీతారామ రాజు పేరును విమానశ్రయానికి పెట్టాలని శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తోందని సీఎం తెలిపారు. ఆయన స్మారక మ్యూజియం ను కూడా నిర్మించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. విప్లవ వీరుడి విగ్రహం పార్లమెంట్ లో కూడా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Tags:    
Advertisement

Similar News