ఆడుదాం ఆంధ్ర.. అసలు లక్ష్యం అదే అంటున్న జగన్

'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు 21 మంది రాష్ట్రస్థాయి అంబాసిడర్‌ లు, 345 మంది జిల్లా స్థాయిలో ప్రతిభావంతులు కూడా ముందుకు వచ్చారని చెప్పారు.

Advertisement
Update:2023-12-21 09:23 IST

గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను వెలికిదీయడంతోపాటు.. గ్రామ స్థాయిలో ప్రజల్లో వ్యాయామం పట్ల అవగాహన పెంచి, క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచుకునేలా చేయడమే 'ఆడుదాం ఆంధ్ర' లక్ష్యమని చెప్పారు సీఎం జగన్. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో డయాబెటిక్, బీపీ కేసులు ఎక్కువగా బయటపడ్డాయని, ప్రివెంటివ్‌ కేర్‌ లో భాగంగా ప్రతి ఇంటిలో కూడా ఫిజికల్‌ యాక్టివిటీస్‌ పెరిగితే.. భవిష్యత్తులో ఇవన్నీ తగ్గుతాయని అన్నారు. గ్రామస్థాయిలో వ్యాయామం, క్రీడలు ఈ రెండింటిని ప్రమోట్‌ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అన్నారు సీఎం జగన్.

47రోజులపాటు ఆటల పోటీలు..

డిసెంబరు 26 నుంచి 'ఆడుదాం ఆంధ్ర' మొదలవుతుంది. ఫిబ్రవరి 10వరకు 47 రోజులపాటు కార్యక్రమం జరుగుతుంది. సచివాలయం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కోసం 14,997 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 9,043 క్రీడా మైదానాలను గుర్తించారు. ఆయా మైదానాల అభివృద్ధి పనులు కూడా ఇందులోనే భాగమవుతాయి. ఆడుదాం ఆంధ్ర కోసం 1.23 కోట్ల రిజిస్ట్రేషన్స్‌ జరిగాయని తెలిపారు అధికారులు. 34.19 లక్షల మంది క్రీడాకారులు ఆటల పోటీల్లో పాల్గొంటారు.

'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు 21 మంది రాష్ట్రస్థాయి అంబాసిడర్‌ లు, 345 మంది జిల్లా స్థాయిలో ప్రతిభావంతులు కూడా ముందుకు వచ్చారని చెప్పారు.వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన టీమ్ లకు గరిష్టంగా 5 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఉంటుంది. నియోజకవర్గ స్థాయిలో విజేతలకు కూడా బహుమతులు ఇస్తారు. ఆటలకు సంబంధించిన క్రీడా సామగ్రి, దుస్తులను కూడా ప్రభుత్వమే సమకూరుస్తోంది. ప్రతి ఏటా డిసెంబర్ లో ఆటల పోటీలు మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

Tags:    
Advertisement

Similar News