అదానీ విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలి : షర్మిల
గత ప్రభుత్వ హయాంలో అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల వల్ల ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అదానీతో కుదుర్చుకున్న కరెంట్ ఒప్పందాల వల్ల ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడ రాజ్ భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. అదానీ మాజీ సీఎం జగన్ మధ్య జరిగిన విద్యుత్ కొనుగోళ్ళు,1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై విచారణ జరిపించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ డీల్ "అదానీ కి లాభం - రాష్ట్ర ప్రజలకు పెను భారంగా మారిందన్నారు. రూ.1.99 పైసలకు దొరికే విద్యుత్ ను రూ.2.49 పైసలకు కొన్నారు. అన్ని చార్జీలు కలుపుకుంటే యూనిట్ ధర 5 రూపాయలకు పైమాటేని షర్మిల అన్నారు. ఇదే ధరతో 25 ఏళ్లకు డీల్ అంటే ఈ తరంతో పాటు రాబోయే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్లే.
లక్షల కోట్ల ప్రజల సొమ్మును అదానీకి దోచి పెట్టినట్లేని ఆమె ఆరొపించారు. తెలుగు దేశం పార్టీ ఇదో పెద్ద కుంభకోణం అంటూ ఆందోళనలు చేసింది. వెంటనే ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేసింది. తీరా కూటమి అధికారంలోకి వచ్చాక ఎందుకు మాట మార్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు అని అడుగుతున్నాం. ఇదెక్కడి న్యాయమని నిలదీస్తున్నాం. అదానీకి భయపడుతున్నారా ? మోడీకి భయపడుతున్నారా ? చర్యలకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు పోయింది. ప్రపంచం మొత్తం ముడుపుల మీద చర్చిస్తుంది. అదానీ దేశం పరువు తీస్తే, జగన్ రాష్ట్ర పరువు తీశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని జేపీసీ కమీటి వేయాలని షర్మిల డిమాండ్ చేశారు.