Taraka Ratna: తారకరత్నకు తీవ్ర అస్వస్థత, బెంగళూరుకు తరలించే యోచన

Taraka Ratna Health Condition: కార్యకర్తలు ఆయన్ను హుటాహుటిన స్థానికంగా ఒక ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు అక్కడి నుంచి తారకరత్నను మెరుగైన వైద్యం కోసం కుప్పంలోని పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు.;

Advertisement
Update:2023-01-27 13:57 IST
Taraka Ratna: తారకరత్నకు తీవ్ర అస్వస్థత, బెంగళూరుకు తరలించే యోచన

Taraka Ratna: తారకరత్నకు తీవ్ర అస్వస్థత, బెంగళూరుకు తరలించే యోచన

  • whatsapp icon

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పాదయాత్ర చేప‌ట్టిన రోజే అపశృతి చోటు చేసుకుంది. పాదయాత్ర ప్రారంభించిన లోకేష్‌కు సంఘీభావం తెలిపేందుకు న‌లుడు నంద‌మూరి తారకరత్న కుప్పం వచ్చారు. కుప్పం లక్ష్మీపురం మసీదు వద్ద ప్రార్థనలు చేసేందుకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయారు.

కార్యకర్తలు ఆయన్ను హుటాహుటిన స్థానికంగా ఒక ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు అక్కడి నుంచి తారకరత్నను మెరుగైన వైద్యం కోసం కుప్పంలోని పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు. తారకరత్న పడిపోయిన పరిస్థితి తెలుసుకున్న బాలకృష్ణ ఆస్పత్రికి వచ్చారు.

తారకరత్న పరిస్థితిని మెరుగుపరిచేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. తారకరత్నను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించే యోచనలో టీడీపీ నేతలు ఉన్నట్టు సమాచారం.

Tags:    
Advertisement

Similar News