జర్నలిస్ట్‌లకు వైసీపీ గ్రాండ్‌గా పార్టీ

మీడియాకు వైసీపీ మధ్య గ్యాప్ బాగానే ఉంది. అత్యధిక మీడియా సంస్థలు టీడీపీ అనుకూలమైనవి కావడం కూడా అందుకు ప్రధాన కారణం. గ్యాప్‌ను తగ్గించుకునేందుకు వైసీపీ కూడా పెద్దగా ప్రయత్నాలు చేసింది లేదు. అయితే తాజాగా జర్నలిస్టులకు విజయవాడలోని ప్రముఖ హోటల్‌లో వైసీపీ పెద్దలు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. రకరకాల ఫుడ్ ఐటమ్స్‌తో పాటు.. ఫారిన్‌ లిక్కర్‌ కూడా సరఫరా చేశారు. ఈ విందుకు టీడీపీ అనుకూల మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు కూడా హాజరయ్యారు. ప్లీనరీకి […]

Advertisement
Update:2022-07-12 06:53 IST
జర్నలిస్ట్‌లకు వైసీపీ గ్రాండ్‌గా పార్టీ
  • whatsapp icon

మీడియాకు వైసీపీ మధ్య గ్యాప్ బాగానే ఉంది. అత్యధిక మీడియా సంస్థలు టీడీపీ అనుకూలమైనవి కావడం కూడా అందుకు ప్రధాన కారణం. గ్యాప్‌ను తగ్గించుకునేందుకు వైసీపీ కూడా పెద్దగా ప్రయత్నాలు చేసింది లేదు. అయితే తాజాగా జర్నలిస్టులకు విజయవాడలోని ప్రముఖ హోటల్‌లో వైసీపీ పెద్దలు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు.

రకరకాల ఫుడ్ ఐటమ్స్‌తో పాటు.. ఫారిన్‌ లిక్కర్‌ కూడా సరఫరా చేశారు. ఈ విందుకు టీడీపీ అనుకూల మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు కూడా హాజరయ్యారు. ప్లీనరీకి బాగా కవరేజ్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఐ అండ్ పీఆర్‌ మినిస్టర్‌ వేణుగోపాల్‌ కూడా ఈ పార్టీకి హాజరయ్యారు.

వైసీపీ పెద్ద‌లు జర్నలిస్టులతో ఇంట్రాక్ట్ అయ్యారు. మీడియా విషయంలో వైసీపీ పరంగా ఎలాంటి లోపాలున్నాయి అన్న వాటిపై జర్నలిస్టుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. కాకపోతే జర్నలిస్టులకు ఎంతగా విందు భోజనాలు పెట్టినా.. సదరు సంస్థల యజమానులు వైసీపీ వ్యతిరేకులైనప్పుడు వారు చేసేదీ పెద్దగా ఉండదు.

Tags:    
Advertisement

Similar News