ఏపీకి ద్రౌపది ముర్ము.. వైసీపీ ఘన స్వాగతం

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సీఎం జ‌గ‌న్ నివాసానికి వెళ్లి.. అక్కడ తేనీటి విందులో పాల్గొన్నారు. సీఎం జగన్, ఆయన సతీమణి భారతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంగ‌ళ‌గిరిలోని సీకే కన్వెన్షన్ హాల్‌కు చేరుకున్న ద్రౌప‌ది ముర్మును సీఎం జ‌గ‌న్ స‌త్క‌రించి.. వైసీపీ ఎంపీలు, […]

Advertisement
Update:2022-07-12 23:45 IST

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సీఎం జ‌గ‌న్ నివాసానికి వెళ్లి.. అక్కడ తేనీటి విందులో పాల్గొన్నారు. సీఎం జగన్, ఆయన సతీమణి భారతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంగ‌ళ‌గిరిలోని సీకే కన్వెన్షన్ హాల్‌కు చేరుకున్న ద్రౌప‌ది ముర్మును సీఎం జ‌గ‌న్ స‌త్క‌రించి.. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ప‌రిచ‌యం చేశారు.

రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారం ఇటీవల రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ మాట్లాడుతూ.. తాము వైసీపీని అంటరాని పార్టీగానే చూస్తామన్నారు. తాము వైసీపీ మద్దతు కోరకపోయినా.. వారే ఇచ్చారని వ్యాఖ్యానించారు.

సత్యకుమార్ వార్తలపై వైసీపీ సీరియస్ అయ్యింది. పేర్ని నాని ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ హైకమాండ్ అడిగితేనే తాము మద్దతు ఇచ్చామని.. ఈ విషయం సత్యకుమార్ కు తెలియదేమోనని వ్యాఖ్యానించారు. అనంతరం బీజేపీ జాతీయ నేతలు సైతం సత్యకుమార్ వ్యాఖ్యలను ఖండించారు.. వైసీపీ మద్దతు విషయంలో సత్యకుమార్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు తెలుగుదేశం పార్టీ మాత్రం తాము ద్రౌపది ముర్ముకే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ద్రౌపది ముర్మును కలిసేందుకు అవకాశం కల్పించాలని .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరినట్టు వార్తలు వచ్చాయి.

ఇంతకాలం ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై వైసీపీని .. టీడీపీ విమర్శించిన విషయం తెలిసిందే. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీయడానికి ఇదే మంచి సందర్భం అని టీడీపీ నేతలు, మీడియా కోడై కూశాయి. తాజాగా టీడీపీ సైతం ఎన్డీయే అభ్యర్థికే మద్దతు ఇవ్వడం గమనార్హం. బీజేపీతో సఖ్యత కోసం టీడీపీ ప్రయత్నిస్తోంది.. అందుకే అడగకపోయినా.. ఎన్డీయేకు మద్దతు ఇచ్చిందని పలువురు విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News