సత్యకుమార్ పై బీజేపీ అధిష్టానం సీరియస్

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం వైసీపీ మద్దతు కోరలేదంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం సీరియస్ గా స్పందించింది. వైసీపీతో బీజేపీకి ఎలాంటి సంబంధాలు లేవని, ఎక్కడో వెనుక నిల్చోని ఫొటోలు దిగి బీజేపీ అధిష్టానంతో తమకు సంబంధాలు ఉన్నాయని కొందరు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా సత్యకుమార్ నిన్న వ్యాఖ్యానించారు. బీజేపీ దృష్టిలో వైసీపీ అంటరాని పార్టీ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా అంతే […]

Advertisement
Update:2022-07-11 15:44 IST

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం వైసీపీ మద్దతు కోరలేదంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం సీరియస్ గా స్పందించింది. వైసీపీతో బీజేపీకి ఎలాంటి సంబంధాలు లేవని, ఎక్కడో వెనుక నిల్చోని ఫొటోలు దిగి బీజేపీ అధిష్టానంతో తమకు సంబంధాలు ఉన్నాయని కొందరు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా సత్యకుమార్ నిన్న వ్యాఖ్యానించారు. బీజేపీ దృష్టిలో వైసీపీ అంటరాని పార్టీ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో వైసీపీ కూడా అంతే సీరియస్ గా స్పందించింది. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి సత్యకుమార్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు ఫోన్ చేసి మరీ రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాల్సిందిగా సీఎం జ‌గ‌న్‌ని విజ్ఞప్తి చేశారని, ఆటలో అరటిపండు లాంటి సత్యకుమార్ కు ఈ విషయాలు తెలిసి ఉండకపోవచ్చు అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

నిజంగా బీజేపీ అధిష్టానం వైసీపీ మద్దతు కోరి ఉండకపోతే ద్రౌపది ముర్ము.. సీఎం జ‌గ‌న్‌ను కలవకుండా అడ్డుకోవాలంటూ సత్యకుమార్ కు సవాల్ కూడా చేశారు పేర్ని నాని. ఈ అంశం మరింత వివాదాస్పదమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం స్పందించింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ అంశంపై మీడియా ముందు క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్వయానా బీజేపీ అధిష్టానమే విజ్ఞప్తి చేసిందని ఆయన స్పష్టత ఇచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగత సంప్రదింపులు కూడా జరిపామని ఆయన వివరణ ఇచ్చారు.

సత్య కుమార్ తన వ్యక్తిగత హోదాలో వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు అని గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యానించారు. సత్య కుమార్ వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు అని కూడా కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News