బీజేపీ నాయకులారా.. ఈ గోడ మీరు కడతారా?

సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జూలై 3న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో విజయ సంకల్ప సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ హాజరైన ఈ బహిరంగ సభకు వేలాది మంది బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. పరేడ్ గ్రౌండ్‌లోకి వెళ్లడానికి వీలుగా అక్కడి కాంపౌండ్ గోడలను పలుచోట్ల కూల్చారు. సభ ముగిసి ఇప్పటికి ఆరు రోజులవుతున్నా.. ఇంత వరకు దాన్ని తిరిగి నిర్మించలేదు. దీనిపై పరేడ్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ మండిపడింది. పరేడ్ గ్రౌండ్‌లో కూల్చిన […]

Advertisement
Update:2022-07-09 04:03 IST

సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జూలై 3న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో విజయ సంకల్ప సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ హాజరైన ఈ బహిరంగ సభకు వేలాది మంది బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. పరేడ్ గ్రౌండ్‌లోకి వెళ్లడానికి వీలుగా అక్కడి కాంపౌండ్ గోడలను పలుచోట్ల కూల్చారు. సభ ముగిసి ఇప్పటికి ఆరు రోజులవుతున్నా.. ఇంత వరకు దాన్ని తిరిగి నిర్మించలేదు. దీనిపై పరేడ్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ మండిపడింది.

పరేడ్ గ్రౌండ్‌లో కూల్చిన గోడను ఎవరు కడతారు? దానికి బాధ్యులు ఎవరంటూ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ‘ఈ కూల్చిన గోడను ఎవరు కడతారు? కంటోన్మెంట్ బోర్డా.. బీజేపీ నాయకులా?’ అని రాసిన ఫ్లెక్సీని అక్కడ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. కొంతమంది ఈ ఫొటోకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ట్యాగ్ చేశారు. నగరానికి చెందిన ఎంపీ, మంత్రిగా దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పరేడ్ గ్రౌండ్‌లో 20 టన్నుల వ్యర్థాలు..
బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభ అనంతరం పరేడ్ గ్రౌండ్ నుంచి దాదాపు 20 టన్నుల వ్యర్థాలను సేకరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ (ఎస్‌సీబీ)కు చెందిన హెల్త్ అండ్ సానిటైజేషన్ వింగ్ ఆధ్వర్యంలో గ్రౌండ్‌ను 30 మంది సిబ్బంది శుభ్రం చేశారు. సభ జరిగే సమయంలో 200 చెత్త బుట్టలను గ్రౌండ్‌లో పెట్టారు. కానీ కార్యకర్తలు మాత్రం దాంట్లో వేయకుండా గ్రౌండ్‌లో ఎక్కడబడితే అక్కడ చెత్తను వేయడంతో సేకరణ కష్టంగా మారింది.

36 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న పరేడ్ గ్రౌండ్స్‌లో వాటర్ ప్యాకెట్స్, బాటిల్స్, పేపర్ ప్లేట్స్, ప్లకార్డులు, ఇతర చెత్తను సేకరించారు. అలాగే గ్రౌండ్‌లో దాదాపు 1000 వరకు బీజేపీ జెండాలను కూడా పారేసి పోయినట్లు అధికారులు చెప్పారు. సేకరించిన చెత్తను సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కోసం తిరుమలగిరి డంప్‌ యార్డ్‌కు తరలించామని వివరించారు.

Tags:    
Advertisement

Similar News